గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌పథ్‌లో వాయుసేన చేపట్టే వైమానిక విన్యాసాలు ఓ మహిళా అధికారి ఆధ్వర్యంలో జరగనున్నాయి. గణతంత్ర వేడుకల్లో ఓ మహిళకు ఈ బాధ్యతను అప్పగించడం ఇదే తొలిసారి. ఫ్లైట్ లెఫ్టినెంట్ స్వాతి రాఠోడ్‌కు ఈ అవకాశం లభించింది.
రాఠోడ్ ఎవరు?
రాజస్థాన్‌లోని ప్రేమ్‌పురా గ్రామానికి చెందిన స్వాతి రాఠోడ్ అజ్మేర్లో పాఠశాల విద్యను, జైపుర్‌లోని ఐసీజీ కాలేజీలో ఉన్నత విద్యను అభ్యసించారు. ప్రస్తుతం రాఠోడ్ అజ్మేర్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆమె తండ్రి డాక్టర్ భవానీ సింగ్ వ్యవసాయ శాఖలో డిప్యూటీ డైరెక్టర్.