Women Must Carry These Safety Items : నగరాల్లో వర్కింగ్ ఉమెన్స్.. రాత్రి పొద్దుపోయే వరకు ఆఫీసు పనులు చేయడం సాధారణమైపోయింది. ఉద్యోగ బాధ్యతలు ముగించుకొని.. రాత్రి 10, 11 గంటలకు ఇంటికి చేరుకునే వారు ఎందరో ఉన్నారు. ఒక్కోసారి మరింత ఆలస్యం కూడా కావొచ్చు. పట్టపగలే మహిళలపై దాడులు జరుగుతున్నాయి. అలాంటిది.. రాత్రివేళ ఆ ఛాన్సు ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు.. ఒంటరిగా ఉన్నా కూడా తమను తాము రక్షించుకునేలా సిద్ధంగా ఉండడం అవసరం. అందుకే.. మహిళలు ఎల్లప్పుడూ తమ వెంట కొన్ని వస్తువులు తీసుకెళ్లాలి. మరి, అవేంటీ ? ఎలా వాడాలి? అనే విషయాలను తెలుసుకుందాం.
పెప్పర్ స్ప్రే :మహిళలకు ఆపద సమయంలో పెప్పర్ స్ప్రే చాలా ఉపయోగపడుతుంది. దీన్ని స్ప్రే చేస్తే.. దాడిచేయడానికి వచ్చిన వారి కళ్లు మండిపోతాయి. అప్పుడు సులభంగా తప్పించుకునేందుకు అవకాశం ఉంటుంది. అందుకే.. ఎక్కువ మంది మహిళలు దీనిని తమ బ్యాగుల్లో తీసుకెళ్తున్నారు. ఇందులో.. అడ్వాన్స్‌డ్ వెర్షన్లుగా.. 'పెప్పర్ స్ప్రే గన్'లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటిని ఆన్‌లైన్ స్టోర్‌లు, లోకల్ మార్కెట్లలో కొనుగోలు చేయవచ్చు. మంచి కంపెనీ పెప్పర్ స్ప్రేలు 20 అడుగుల దూరం వరకు స్ప్రే చేస్తాయి.
జీపీఎస్ (GPS) ట్రాకర్ :జీపీఎస్ ట్రాకర్ ఒక ఆయుధంగా పని చేయకపోయినా.. ఆపద సమయంలో మహిళల్ని ఇది కాపాడుతుంది. జీపీఎస్ ట్రాకర్ లైవ్ లోకేషన్‌ను ట్రాక్ చేస్తుంది. మీరు క్యాబ్ లేదా ఆటో ఎక్కినప్పుడు మీ దగ్గరి స్నేహితులు, తల్లిదండ్రులకు లైవ్ లోకేషన్‌ను షేర్ చేయవచ్చు. మహిళలు ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు, ప్రయాణంలో ఆలస్యం అయినప్పుడు కుటుంబ సభ్యుల్లో ఆందోళనను తగ్గించేందుకు జీపీఎస్ ట్రాకర్ ఉపయోగపడుతుంది.
పాయింటెడ్ రింగ్స్ :మహిళలు ధరించే యాక్సెసరీస్ కూడా ఆపద సమయాల్లో ఆయుధంగా పనిచేస్తాయి. అందుకే మహిళలు చేతి వేలికి పదునైనా ఉంగరాన్ని ధరించండి. ఉంగరం సౌకర్యవంతంగా, పదునుగా ఉండేలా చూసుకోండి.