women in defence: భారత్- బంగ్లాదేశ్ సరిహద్దులో పెట్రోలింగ్‌ను మరింత పటిష్ఠం చేసింది సైన్యం. సరిహద్దుల్లో అక్రమ రవాణాకు పాల్పడుతున్న మహిళలను తనిఖీ చేసేందుకు లేడీ కానిస్టేబుళ్లను నియమించినట్లు సరిహద్దు భద్రతా దళ అధికారి తెలిపారు.
"ఇది భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతం. ఇక్కడ ఉండే గ్రామంలో చాలా భాగం మన దేశానికి చెందింది. దీనిలో సుమారు 56 మంది మహిళలు ఉన్నారు. వీరు రోజు బంగ్లాదేశ్‌కు ప్రయాణిస్తుంటారు. వారు భారత్‌లోకి ప్రవేశించే సమయంలో తనిఖీలు చేయాలి. అందుకే మహిళా కానిస్టేబుళ్లను సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేశాం"
- సుహాసిని పుహాన్, సరిహద్దు భద్రతాదళ సిబ్బంది.
సరిహద్దు గ్రామాలకు కొన్ని మీటర్ల దూరంలో బంగ్లాదేశ్ ఉండడం కారణంగా కొంతమంది గ్రామస్థులు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సుహాసిని తెలిపారు. అయితే స్థానికంగా ఉండే మహిళలు దేశంలోకి అక్రమంగా రవాణా చేయకుండా చూసేందుకు నిరంతరం తనిఖీ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అంతేగాకుండా అధికారులు రైడ్స్ నిర్వహిస్తున్న సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వారికి తోడుగా వెళ్లనున్నట్లు వివరించారు.