Women Harassment: అసభ్యకరమైన మెసేజ్‌లు పంపిస్తూ ఓ బాలికను వేధించాడు ఆ స్కూల్ హెడ్మాస్టర్. ఈ విషయం గురించి ఎవరికైనా చెప్తే చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఒడిశాలోని కలహండీ జిల్లాలో జరిగింది.
ఇదీ జరిగింది..

గత కొంతకాలంగా పాఠశాలకు వచ్చే బాధితురాలికి వాట్సాప్ సహా పలు సోషల్‌మీడియా యాప్స్ ద్వారా నిందితుడు అసభ్యకర మెసేజ్‌లు పంపించి వేధిస్తూ ఉండేవాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే.. ఆమెను స్కూల్ నుంచి తొలగించడమే కాక చంపేస్తానని బెదిరించేవాడు. కానీ ఎట్టకేలకు బాధితురాలు ఆ స్కూల్లోని ఓ మహిళా టీచర్‌కు ఈ విషయాన్ని చెప్పింది. టీచర్ సాయంతో బాధితురాలు ఫిర్యాదు చేయగా.. పోలీసులు నిందితుడిని గురువారం అరెస్ట్ చేశారు.
ఇదీ చూడండి:బాలికపై సామూహిక అత్యాచారం- వీడియో చిత్రీకరించి బెదిరింపు