Women Delivery On Road in Rickshaw :వైద్యుల నిర్లక్ష్యం కారణంగా నడిరోడ్డుపై రిక్షాలోనే బిడ్డకు జన్మనిచ్చింది ఓ మహిళ. పురిటి నొప్పులతో వచ్చిన గర్భిణీని ఆసుపత్రిలో చేర్చుకోకుండా మరో హాస్పిటల్‌కు సిబ్బంది సిఫార్సు చేయడం వల్ల ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. పంజాబ్‌లోని పఠాన్‌కోట్ జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. జిల్లాకు ఓ చెందిన ఓ గర్భిణీకి మంగళవారం పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను పఠాన్‌కోట్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ ఆ మహిళను ఆసుపత్రిలో చేర్పించుకునేందుకు అక్కడి సిబ్బంది నిరాకరించారు. కనీస పరీక్షలు నిర్వహించకుండానే అమృత్సర్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు.
పేదరికం కారణంగా మరే ఇతర ఆసుపత్రికి వారు వెళ్లలేకపోయారు. దీంతో చేసేది లేక తిరిగి ఇంటికే వెళ్తుండగా మార్గమధ్యలోనే రిక్షాలో చిన్నారికి జన్మనిచ్చింది ఆ మహిళ. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దూమారం రేపింది. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేసున్నారు. దీంతో ఆసుపత్రి సిబ్బందిపై విచారణకు ఆదేశించారు ఉన్నతాధికారులు.
"ఘటనపై విచారణకు ఆదేశించాం. అందుకోసం ఓ టీమ్‌ను సైతం ఏర్పాటు చేశాం. చిన్నారికి జన్మనిచ్చిన మహిళ కుటుంబంతోనూ మాట్లాడాం. విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం" అని జిల్లా సివిల్ సర్జన్ అదితి సలారియా తెలిపారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు.
మత్తుమందు ఇచ్చి.. ఆపరేషన్ చేయకుండా వెళ్లిపోయిన వైద్యులు.. గంటల పాటు స్పృహ లేకుండానే..
కొద్ది రోజుల క్రితం ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించారు వైద్యులు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల కోసం వచ్చిన మహిళల ప్రాణాలతో చెలగాటమాడారు. మత్తుమందు ఇచ్చి ఆపరేషన్ చేయకుండానే వెనుదిరిగారు. దీంతో ఆపరేషన్ల కోసం వచ్చిన మహిళలు.. వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన సామూహిక కుటుంబ నియంత్రణ ఆపరేషన్ క్యాంప్‌లో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Maratha Reservation Protest : మరాఠాల రిజర్వేషన్ల ఆందోళన హింసాత్మకం.. శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు
Man Carrying Severed Hand : తెగిపోయిన చేతిని పట్టుకుని తిరుగుతూ వ్యక్తి హల్చల్.. ఏం జరిగిందంటే?