తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాష్ట్రపతి పర్యటనలో ట్రాఫిక్ జామ్-మహిళ మృతి! - రాష్ట్రపతి పర్యటనలో విషాదం

రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ ఉత్తర్​ప్రదేశ్ పర్యటన నేపథ్యంలో విషాదం జరిగింది. కాన్పుర్​లో గంటపాటు ట్రాఫిక్​ నిలిపివేసిన కారణంగా ఓ మహిళ మరణించారు. ఈ ఘటనపై కాన్పుర్​ కమిషనర్​ క్షమాపణలు చెప్పారు.

ramnath kovind
రామ్​నాథ్ కోవింద్, రాష్ట్రపతి

By

Published : Jun 26, 2021, 5:05 PM IST

భారత రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ స్వగ్రామ పర్యటన నేపథ్యంలో ఓ విషాద ఘటన జరిగింది. రాష్ట్రపతి ఉత్తర్​ప్రదేశ్​లోని​ కాన్పుర్​కు వెళ్తున్న సమయంలో ట్రాఫిక్​ను నిలిపివేసిన కారణంగా ఓ మహిళ మరణించారు.

ఇదీ జరిగింది..

కాన్పుర్ ఇండియన్ ఇండస్ట్రీస్ మహిళా విభాగం అధ్యక్షురాలు వందన మిశ్రా అనారోగ్యం పాలయ్యారు. అయితే.. శుక్రవారం ఆమెను గోవింద్​పురి బ్రిడ్జి మీదుగా ఆసుపత్రికి తీసుకువెళ్లాలని అనుకున్నారు మిశ్రా భర్త. ఇదే సమయంలో రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో.. గోవింద్​పురి బ్రిడ్జ్​ వద్ద ట్రాఫిక్​ జామ్​ అయ్యింది.

దాదాపు గంట సమయం తర్వాత వాహనాలు కదిలేందుకు అనుమతించారు అధికారులు. మిశ్రాను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆమె మార్గ మధ్యలోనే మరణించారని వైద్యులు స్పష్టం చేశారు.

అయితే.. పోలీసులను బతిమిలాడినా వారు వాహనాన్ని పంపేందుకు అనుమతించలేదని, మిశ్రా మరణానికి వారే కారణమని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. కాన్పుర్ పోలీస్ కమిషనర్ అసీమ్​ అరుణ్ ఈ ఘటనపై క్షమాపణలు చెప్పారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత తమదేనని అన్నారు.

ఇదీ చదవండి:ఆ ఫ్రెండ్స్​ కోసం రాష్ట్రపతి రైలు ప్రయాణం

ABOUT THE AUTHOR

...view details