Women Changs Gender For Love: ప్రేమిస్తున్నానని చెప్పి ఒక మహిళ మరో మహిళను బలవంతంగా పురుషుడిగా మారేలా చేసి.. ఆపై మోసగించిన ఘటన మదురైలో చోటుచేసుకుంది. వీరిలో ఓ మహిళ పురుషుడిలా మారడానికి శస్త్రచికిత్స చేసుకున్న అనంతరం వివాహం కూడా చేసుకున్నారు. కానీ ఆ మహిళ ఇప్పుడు మోహం చాటేసింది. దీంతో తనకు న్యాయం చేయాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేశాడు బాధితుడు.
ప్రేమ కోసం పురుషుడిలా మారిన మహిళ.. చివరకు ఏమైందంటే? - తమిళనాడు న్యూస్
Women Changs Gender For Love: తమిళనాడు మదురైలో ఓ అరుదైన ఘటన జరిగింది. ప్రేమిస్తున్నాని చెప్పి ఒక మహిళ.. మరో మహిళను బలవంతంగా పురుషుడిగా మారేలా చేసి.. ఆపై మోసగించింది. దీంతో పురుషుడిగా మారిన అతడు పోలీసులను ఆశ్రయించాడు.
ఇదీ జరిగింది:మదురై జిల్లాలోని విల్లాపురం మీనాక్షినగర్ ప్రాంతానికి చెందిన జయసుధకు ఉమచ్చికులం ప్రాంతానికి చెందిన సెంథిలతో స్నేహం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఇద్దరు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. జయసుధపై పురుషుడిగా మారాలని సెంథిల ఒత్తిడి చేసింది. దీంతో 2021 మదురై ప్రభుత్వ రాజాజీ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించుకుని, తన పేరును ఆదిశివ మార్చుకుంది. వీరిద్దరూ ఓ ఆలయంలో వివాహం చేసుకున్నారు. సెంథిల తల్లిదండ్రులకు విషయం తెలియడం వల్ల వారు తిరుప్పరకుండ్రం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే సెంథిల తాను తల్లిదండ్రులతో వెళ్లిపోతానని చెప్పింది.
ఇదీ చదవండి:పెళ్లి పేరుతో మోసం.. తల్లీకూతుళ్లపై గ్యాంగ్ రేప్.. 2 నెలల చిన్నారిపైనా..