మహిళలకు చరిత్ర సృష్టించగల సామర్థ్యం ఉందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. అన్ని విభాగాల్లో మహిళలకు అవకాశాలను కల్పించటమే మహిళా సాధికారతకు పునాదని.. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ట్వీట్టర్ ద్వారా తెలిపారు.
ట్విట్టర్ ద్వారా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన రాహుల్ " మహిళలు చరిత్ర సృష్టించగల సమర్థులు. దయతో వారు భవిష్యత్‌ను జయించగలరు. వాళ్లను ఎవరూ ఆపవద్దు."
-- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
ట్విట్టర్ ద్వారా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రియాంక
"మహిళలకు అన్ని రంగాల్లో వారి గళం వినిపించేలా అవకాశం ఇవ్వాలి. అదే మహిళా సాధికారతకు పునాది. ప్రతి రంగంలో మహిళలకు అవకాశం ఇస్తే ప్రపంచం అందంగా, శక్తిమంతంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ విధానాలు మహిళలను శక్తిమంతం చేసినందుకు నాకు గర్వంగా ఉంది."
-- ప్రియాంక గాంధీ వాద్రా, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
మహిళలు దేశానికి వెన్నెముక లాంటివారని కాంగ్రస్ అభివర్ణించింది. వారు ప్రతిరోజునూ పండగలా నిర్వహించుకోవాలని, వారి వైపు, వారి కోసం నిలబడదామని తెలిపింది.
ఇదీ చదవండి :'అతివల విజయాలకు ప్రతీకగా మహిళా దినోత్సవం'