గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఓ మహిళ, ట్రాన్స్జెండర్ జంట ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. అయితే వీరి బంధాన్ని అంగీకరించని యువతి కుటుంబసభ్యులు వారి వద్దకు బలవంతంగా తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారు. దీనిపై యువతి భాగస్వామి కోర్టును ఆశ్రయించగా వీరికి అనుకూలంగా తీర్చునిచ్చింది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.
తమిళనాడులోని దిండిగుల్ జిల్లాకు చెందిన యువతి విరుధ్నగర్కు చెందిన ఓ ట్రాన్స్జెండర్ను ప్రేమించింది. వీరిద్దరూ ఈనెల 7న వివాహం చేసుకున్నారు. అయితే అమ్మాయి తరఫు వారు ఈ పెళ్లిని వ్యతిరేకించారు. ఈనెల 16న ఈ జంట ఉంటున్న ఇంటిలోకి వచ్చిన బంధువులు.. యువతి, ట్రాన్స్జెండర్పై దాడి చేశారు. అనంతరం యువతిని వారి ఇంటికి తీసుకెళ్లిపోయారు. యువతి బంధువులు ఆమె ఆలోచనను మార్చేందుకు షాక్ ట్రీట్మెంట్ ఇప్పించారని ఆమె భాగస్వామి ఆరోపించారు. 'మా బంధాన్ని అంగీకరించమని వారు అంటున్నారు. ఈ క్రమంలో ఆమె సోదరుడు తనను చిత్రహింసలు పెట్టాడు. నన్ను కూడా బెదిరించారు' అని ట్రాన్స్జెండర్ పేర్కొన్నారు.