ఉత్తర్‌ప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తోన్న ఓ మహిళ నామపత్రాలు తిరస్కరణకు గురయ్యాయి. పుర్కాజీ బ్లాక్ పరిధిలో సర్పంచి అభ్యర్థిగా పోటీలో నిలిచిన సోనియా అనే ఆ అభ్యర్థి పత్రాలపై ప్రతీచోటా ఆమె రెండో భర్త సతేంద్ర పేరు ఉంది. అయితే ఓటర్ లిస్ట్‌లో మాత్రం ఆమె మొదటి భర్త దేవేందర్ పేరు ఒక్కటే ఉంది. ఇదే కారణంతో నామినేషన్‌ను తిరస్కరించినట్లు రిటర్నింగ్ అధికారి ఆర్.కె శ్రీవాస్తవ తెలిపారు.
మహిళ నామినేషన్ తిరస్కరణ.. మొదటి భర్త వల్లే! - ఉత్తర్‌ప్రదేశ్ నేర వార్తలు
ఉత్తర్‌ప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో సరైన పత్రాలు లేని కారణంగా ఓ మహిళ నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఆమె పత్రాల్లో ప్రస్తుత భర్త పేరు ఉండగా.. ఓటర్ లిస్ట్‌లో మాత్రం మొదటి భర్త పేరు ఉండటమే ఇందుకు కారణమని అధికారులు తెలిపారు.
నామినేషన్లో మొదటి భర్త పేరు.. తిరస్కరణ
ఆ మహిళ మొదట దేవేందర్‌ను పెళ్లాడింది. ఆయన ఇంట్లో నుంచి వెళ్లిపోయాక.. దేవేందర్ సోదరుడు సత్యేందర్‌ను పెళ్లి చేసుకుంది.