తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అప్పు కోసం మహిళ దారుణ హత్య.. కత్తితో ఛాతిని కోసి.. - పంజాబ్​ హత్య కేసు

బిహార్​లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఓ వ్యక్తి పదునైన ఆయుధంతో ఆమె శరీర భాగాలను కోసి మరీ హత్యకు పాల్పడ్డాడు. అప్పును తిరిగి చెల్లించనందునే నిందితుడు ఈ కిరాతకానికి పాల్పడినట్లు మృతురాలి భర్త ఆరోపించాడు. మరో ఘటనలో డ్రగ్స్​కు బానిసైన యువకుడు తన మామను కత్తితో పొడిచి మరీ హత్య చేశాడు.

Murder In Bhagalpur
Murder In Bhagalpur

By

Published : Dec 5, 2022, 11:01 AM IST

బిహార్​లో దారుణమైన ఘటన జరిగింది. ఓ దుర్మార్గుడు పదునైన ఆయుధంతో.. ఓ మహిళపై దాడిచేసి కాళ్లు, చేతులు, ఛాతి భాగాల్లో పొడిచి హత్య చేశాడు. శనివారం సాయంత్రం జరిగిందీ ఘటన. అప్పు విషయంలో వివాదమే ఇందుకు కారణం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
భాగల్​పుర్​ జిల్లా పిరపైంతీ పోలీస్​స్టేషన్​ పరిధిలోని ఛోటీ దిలోరా ప్రాంతానికి చెందిన నీలం దేవి(42) అనే మహిళ శనివారం సాయంత్రం 6:30 గంటల సమయంలో మార్కెట్​ నుంచి ఇంటికి వెళ్తుండగా.. షకీల్ అనే వ్యక్తి ఆమెపై దాడి చేశాడు. పదునైన ఆయుధంతో ఆమె కాళ్లు, చేతులు, ఛాతి భాగాల్లో పొడిచాడు. తీవ్రంగా గాయపడ్డ ఆమెను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. నీలం పరిస్థితి విషమంగా ఉన్నందును అక్కడ వైద్యులు మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆదివారం చికిత్స పొందుతూ నీలం దేవి మృతి చెందింది.

నిందితుడి షకీల్​కు, మృతురాలు నీలం దేవికి గతంలో మంచి సంబంధాలు ఉన్నాయి. అందువల్లనే ఆమె అడగగానే షకీల్​ ఏ పూచికత్తూ లేకుండా కొంత సొమ్మును అప్పుగా ఇచ్చాడు. నెలరోజులు క్రితం డబ్బు తిరిగి చెల్లించాలని ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. దానికి మృతురాలి కుటుంబం కొంత సమయం అడగగా అతను నిరాకరించాడు. ఫలితంగా వారి మధ్య వివాదం చెలరేగింది. నిందితుడు నీలంపై కోపం పెంచుకున్నాడు. ఓ పథకం ప్రకారం ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
తమకు న్యాయం చేసి, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని మృతురాలి భర్త కోరాడు. ప్రస్తుతం అన్ని కోణాల్లోను దర్యాప్తు చేపడుతున్నట్లు ఏఎస్పీ బాబురామ్​ తెలిపారు.

డ్రగ్స్​కు బానిసై.. మామను చంపిన యువకుడు
పంజాబ్​లో ఓ యువకుడు తన మామను హత్య చేశాడు. డ్రగ్స్​ కారణంగానే ఆ యువకుడు ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ దారుణం రయ్య మండలంలోని బాబా బకాల గ్రామంలో జరిగింది.
నిందితుడు గత కొన్నిరోజులుగా డ్రగ్స్​కు బానిస అయ్యాడు. అయితే అతని మామ వాటిని తీసుకోకుండా అడ్డుకున్నాడు. దీంతో ఆవేశంలో ఆ యువకుడు తన మామపై కత్తితో దాడి చేసినట్లు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు గుర్తించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి.. విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details