తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కన్నీటి గాథ- రెండు నెలలగా ఆకలితోనే! - పస్తులు

ఆహారం లేక ఐదుగురు పిల్లలతో కూడిన ఆ కుటంబం రెండు నెలల పాటు ఆకలితో అలమటించింది. దాంతో తీవ్ర అనారోగ్యానికి గురవగా.. ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆ కుటంబంలో ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది.

woman-with-5-children-reeling-under-starvation
రెండు నెలలగా ఆహారం లేక..

By

Published : Jun 16, 2021, 9:26 PM IST

Updated : Jun 17, 2021, 9:08 AM IST

ఆకలితో ఆ కుటుంబం అలమటించింది. చట్టుపక్కల వారు ఆహారం అందించినా అది సరిపోయేది కాదు. పరిస్థితి విషమించింది. తీవ్ర అనారోగ్యపాలైన తన ఐదుగురు పిల్లలతో ఆ తల్లి ఆసుపత్రిలో చేరింది. వైద్యులు పరీక్షించగా.. వారు రెండు నెలలుగా ఆకలితో అలమటించారని తేలింది. ఈ ఘటన ఉతర్​ప్రదేశ్​లో అలీగఢ్​ జిల్లాలో జరిగింది.

"ఐదుగురిలో ముగ్గురి పిల్లల పరిస్థితి విషమంగా ఉంది. వారిని కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం."

-డాక్టర్​ అమిత్​, మల్కాన్​ సింగ్​ ఆసుపత్రి, అలీగఢ్​

అలీగఢ్​లోని మందిర్​ నగ్లా ప్రాంతంలో గుడ్డీ అనే 40ఏళ్ల మహిళ నివసిస్తోంది. ఆమెకు అజయ్​(20), విజయ్(15), తీతు(10), సుందర్​ రామ్​(5), అనురాధ(13) అనే ఐదుగురు పిల్లలు ఉన్నారు.

తీవ్ర ఆనారోగ్యంతో 2020లో ఆమె భర్త వినోద్​ చనిపోయాడు. అప్పటి నుంచి ఓ ఫ్యాక్టరీలో నెలకు రూ.4000 జీతానికి పనిచేసింది. కుటుంబానికి ఆసరాగా పెద్ద కుమారుడు అజయ్​ కూలీ పనిచేసేవాడు. అయితే కరోనా కట్టడికి లాక్​డౌన్​ విధించడం వల్ల ఫ్యాక్టరీ మూతపడింది. దాంతో వారి పరిస్థితి అగమ్యగోచరమైంది. పనిలేక ఇల్లు గడవడం కష్టంగా మారింది. చుట్టుపక్కల వారు ఆహారాన్ని అందించినా సరిపోయేది కాదు. కేవలం నీళ్లుతాగే బతుకీడ్చారు. దాంతో వారంతా తీవ్ర అనారోగ్యం పాలయ్యారు.

గుడ్డీ కుమారుడు
గుడ్డీ కుమార్తె
గుడ్డీ కుమారుడు
ఆకలితో ఆసుపత్రిలో చేరిన కుటుంబం

ఇదీ చదవండి: పిల్లల ఆకలి తీర్చలేని స్థితిలో తల్లి!

ఇదీ చదవండి:తల్లితండ్రులు మృతి- చిన్నారికి అన్నీ తానైన అక్క

Last Updated : Jun 17, 2021, 9:08 AM IST

ABOUT THE AUTHOR

...view details