తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీకి నల్లజెండా చూపించిన మహిళపై దుండగుల కాల్పులు - ప్రధాని మోదీ వార్తలు

Woman shot by criminals: కొన్ని రోజుల క్రితం.. ఓ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీకి నల్లజెండా చూపించి ఓ మహిళ నిరసన తెలిపింది. తాజాగా.. ఆ మహిళపై కొందరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఆమె కాలికి గాయమైంది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

black flag to pm modi
మోదీకి నల్లజెండా చూపించిన మహిళపై కాల్పులు- పరిస్థితి విషమం!

By

Published : Jan 4, 2022, 1:45 PM IST

Updated : Jan 4, 2022, 7:11 PM IST

Woman shot by criminals: ఉత్తర్​ప్రదేశ్​ లఖ్​నవూ- వారణాసి బైపాస్​లో కొందరు దుండగులు ఓ మహిళపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కొంత కాలం క్రితం ఈ మహిళ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నల్లజెండా చూపించి నిరసన తెలిపింది.

కారును అడ్డగించి..

రీతా యాదవ్​.. తన భర్త సంతోష్​ యాదవ్​తో కలిసి సుల్తాన్​పుర్​లో నివాసముంటోంది. సోమవారం కోత్వాలి నుంచి కారులో ఆమె ఇంటికి తిరిగి వెళుతున్న క్రమంలో.. లఖ్​నవూ- వారణాసి బైపాస్​పై కొందరు దుండగులు బైక్​లపై వెంబడించారు. ఒక్కసారిగా ఆమె కారును అడ్డగించారు. ఆమెపై కాల్పులకు పాల్పడ్డారు. రీతా యాదవ్​ కాలికి గాయమైంది. అనంతరం స్థానికులు ఆమెను అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Black flag shown to pm Modi: రీతా యాదవ్​.. తన చర్యలతో ఇటీవలి కాలంలో ఉత్తర్​ప్రదేశ్​ వార్తల్లో నిలిచింది. పూర్వాంచల్​ ఎక్స్​ప్రెస్​వే ప్రారంభోత్సవానికి వెళ్లిన ప్రధాని మోదీ.. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మోదీ ప్రసంగం ముగింపు దశకు చేరుకున్న వేళ.. సమాజ్​వాదీ పార్టీ కార్యకర్త రీతా యాదవ్​ నల్లజెండాతో నిరసన తెలిపింది. పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. కొన్ని రోజులు జైలులో గడిపిన ఆమె ఇటీవలే విడుదలైంది.

రీతా యాదవ్​ జైలు నుంచి విడుదలైన కొన్ని రోజులకు.. కాంగ్రెస్​ అగ్రనేత ప్రియాంక గాంధీ ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. రీతాకు కాంగ్రెస్ సభ్యత్వం ఇచ్చారు.

ఇదీ చూడండి:-సీఎం ఎదుటే వాగ్వాదానికి దిగిన మంత్రి, ఎంపీ

Last Updated : Jan 4, 2022, 7:11 PM IST

ABOUT THE AUTHOR

...view details