ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బాస్​ కుమారుడినే కిడ్నాప్ చేసి రూ. 50 లక్షలు కొట్టేశారు- చివరకు.. - దిల్లీలో కిడ్నాప్​

Delhi Kidnapping Case: సులభంగా డబ్బులు సంపాదించడానికి అలవాటు పడిన ఓ మహిళ యజమాని కుమారుడ్ని కిడ్నాప్​ చేసింది. అతడ్ని ప్రాణాలతో విడిచిపెట్టాలంటే కోటి రూపాయిలు ముట్ట చెప్పాలని బెదిరించింది. రూ. 50 లక్షలు రాబట్టుకున్న తర్వాత పోలీసులకు చిక్కి ఊచలు లెక్కపెడుతోంది.

kidnap
కిడ్నాప్​
author img

By

Published : Dec 26, 2021, 2:57 PM IST

Delhi Kidnapping Case: అన్నం పెట్టే ఇంటికే కన్నం వేసిన ఘటన దిల్లీలో జరిగింది. ఉద్యోగం ఇచ్చిన యజమాని కుమారుడ్నే కిడ్నాప్​ చేసింది ఓ మహిళ. కోటి రూపాయలు ఇస్తే కానీ కుమారుడు ప్రాణాలతో రాడని బెదిరించింది. ఈ కిడ్నాప్​ కథను నడపడానికి తనతో పాటు మరో ఇద్దరి సాయం కోరింది. బయట వారు అయితే అనుమానం వస్తుందని ఆలోచించిన ఆమె.. తన ప్రియుడి సాయంతో తతంగాన్ని కానిచ్చేసింది. అనుకున్న విధంగా కోటి రూపాయలకు టెండర్​ పెట్టిన వీరు.. యజమానిని బెదిరించి రూ. 50 లక్షలు రాబట్టుకున్నారు. మరో అడుగు ముందుకు వేసే లోపే దిల్లీ పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు.

ఇదీ జరిగింది..

కరోనా లాక్​డౌన్​తో నిందితురాలి భర్త దివాలా తీయగా.. ఇంటి ఖర్చుల కోసమని ఆమె అప్పులు చేసింది. సులువుగా డబ్బు సంపాదించేందుకు తల్లి, ప్రియుడు కలిసి కిడ్నాప్‌ ప్లాన్‌ చేసింది. గాజీపుర్​లోని ఓ బాంకెట్ హాల్‌లో పనిచేసే మహిళ.. స్థానిక పూల మార్కెట్‌ నుంచి యజమాని కుమారుడ్ని అపహరించింది. ముసుగు ధరించి వచ్చి తుపాకీతో ఆ కుర్రాడిని బెదిరించారు. కారులో కూర్చోవాలని సూచించారు. అనంతరం అశోక్ విహార్ వైపు వెళ్లమని కారు డ్రైవర్‌కు చెప్పారు. ఈ వ్యవహారం జరిగే సమయంలో ప్రధాన నిందితురాలు కారులో ఉంది.

కుమారుడి కిడ్నాప్​ విషయం తెలుసుకున్న తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాపర్.. బాధితురాలి తండ్రి నుండి కోటి రూపాయలు డిమాండ్ చేసినట్లు పేర్కొన్నాడు. అయితే తాను కేవలం రూ. 50 లక్షలు ఇచ్చినట్లు తెలిపాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు సుమారు 150 సీసీటీవీ పుటేజీలను పరిశీలించి అనుమానాస్పదంగా ఉన్న ఓ ద్విచక్ర వాహనాన్ని గుర్తించారు. అనుమానితుల్లో ఒకరిని అరెస్టు చేశారు. ద్విచక్ర వాహనదారుడు వెళ్లిన మార్గంలోనే వెళ్లగా చివరకు మిగతా ఇద్దరు కూడా దొరికినట్లు డీసీపీ ప్రియాంక కశ్యప్ తెలిపారు.

ఇదీ చూడండి:ఏడేళ్ల చిన్నారిపై హత్యాచారం.. చెరుకు తోటలో మృతదేహం!

ABOUT THE AUTHOR

...view details