తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లావుగా ఉన్నావంటూ అత్తింట్లో అవమానం- పెళ్లైన పది నెలలకే ఆత్మహత్య! - fat lady suicide

పెళ్లైన పదినెలలకే ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. 'లావుగా ఉన్నావు. గర్భం దాల్చలేదు' అని అత్తింటి వారు అవమానించడం వల్లే ఆమె బలవన్మరణానికి(Body shaming suicide) పాల్పడిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Woman suicide ove body shaming
మహిళ ఆత్మహత్య

By

Published : Nov 28, 2021, 3:44 PM IST

వివాహం జరిగి ఏడాది కూడా కాలేదు. అంతలోనే ఓ మహిళ తన అత్తింట ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన కేరళ పాలక్కడ్ జిల్లాలో(Kerala palakkad news) జరిగింది.

లావుగా ఉందని, ఇప్పటివరకు గర్భం దాల్చలేదని ఆమెను భర్త సహా అత్తమామలు అవమానించడం(Body shaming suicide) వల్లే ఆత్మహత్యకు పాల్పడిందని పుట్టింటివారు ఆరోపించారు.

"పది నెలల క్రితం నా కుమార్తెకు పెళ్లి జరిగింది. తాను లావుగా ఉన్నందున గర్భం దాల్చలేనని తెలిపింది. అందుకోసం తాను బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నానని కూడా చెప్పింది. నా కుమార్తె చనిపోయాక తన మృతదేహాన్ని అంబులెన్సులో మాకు ఆమె అత్తింటి నుంచి పంపించారు. మృతదేహంతో పాటు తోడుగా ఎవరూ రాలేదు."

-మృతురాలి తల్లి.

బాడీ షేమింగ్ చేయడం వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని బాధితురాలి సోదరుడు ఆరోపించాడు.

ఆత్మహత్య లేఖలో..

నవంబరు 25న సదరు మహిళ ఆత్మహత్యకు పాల్పడగా.. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాల తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టామని చెప్పారు. "పోస్టుమార్టం నివేదికలో సదరు మహిళ ఆత్మహత్యకు పాల్పడినట్లు తేలింది. మృతురాలు ఒక ఆత్మహత్య లేఖ కూడా రాసింది. కానీ, అందులో తన మృతికి ఎవరినీ బాధ్యులుగా పేర్కొనలేదు. అయినా.. ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు.. మృతురాలి భర్త, అతని తల్లిదండ్రులపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలను వారు ఖండించారు" అని మంకారా పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు తెలిపారు.

ఇవీ చూడండి:

'లావెక్కుతున్న భారతం.. ఆ రాష్ట్రాల్లో సమస్య తీవ్రం!'

అంత్యక్రియలకు వెళ్తుండగా ప్రమాదం​- 18 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details