Woman Stripped: ఉత్తర్‌ప్రదేశ్ సోన్‌భద్రలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళను వివస్త్రను చేసి దారుణంగా కొట్టారు కొందరు దుండగులు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు.. ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు.
రాయ్‌పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌఖ్డా గ్రామంలో ఈ ఘటన జరిగింది.
వివరాల ప్రకారం.. బాధిత మహిళ కొద్దిరోజుల కిందట ప్రేమ్‌నాథ్ అనే వ్యక్తికి చెందిన గడ్డిని తగులబెట్టిందని తెలుస్తోంది. దీనిపైనే కక్ష పెంచుకున్న ప్రేమ్‌నాథ్ తన సహచరులతో కలిసి మతిస్థిమితం లేని ఆ మహిళను వివస్త్రను చేశారు. అలాగే కొడుతూ ఊరంతా తిప్పారు.
ఈ విషయం గ్రామపెద్ద వద్దకు చేరినా.. ఆయన రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. బాధిత కుటుంబానికి రూ. 3500 ముట్టజెప్పి వ్యవహారం బయటకు తెలియకుండా చేశారు.