తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గిరిజన మహిళపై దారుణం.. నగ్నంగా మార్చి.. చితకబాది.. - మణిపుర్​లో చెలరేగిన హింస

Woman Stripped Beaten Up : గిరిజన మహిళను వివస్త్రను చేసి కొట్టారు కొందరు వ్యక్తులు. ఈ దారుణం బంగాల్​లో జరిగింది. అసలేం ఏమైందంటే?

woman stripped beaten up
woman stripped beaten up

By

Published : Jul 25, 2023, 8:26 AM IST

Woman Stripped Beaten Up : మణిపుర్​లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి.. అత్యాచారానికి పాల్పడిన ఘటన మరువకముందే అలాంటి ఉదంతమే బంగాల్​లో మరొకటి జరిగింది. పంచాయతీ పెద్దల సమక్షంలో ఓ గిరిజన మహిళను వివస్త్రను చేసిఆమెపై దాడి చేశారు. మహిళా పంచాయతీ సభ్యురాలి ఎదుటే ఈ దారుణం జరగడం గమనార్హం. బాధితురాలు నిరుపేద కుటుంబానికి చెందిన మహిళ. ఆమె భర్త దివ్యాంగుడు. బాధితురాలికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.

అసలేం జరిగిందంటే..
డార్జిలింగ్​ జిల్లాలోని లోయర్ బాగ్‌దోగ్రా పరిధిలోని భుజిపాని గ్రామానికి చెందిన రోష్ని ఖేర్వార్ అనే మహిళకు ప్రదీప్ సర్కార్‌ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయంలో గొడవ జరగడం వల్ల.. జులై 19న ఈ విషయంపై భుజిపానిలోని పంతబరి ప్రాథమిక పాఠశాలలో పంచాయతీ జరిగింది. ఆ సమయంలో ప్రదీప్ సర్కార్ భార్య గౌరీ సర్కార్.. రోష్ని ఖేర్వార్‌తో గొడవ పడింది. ఇరువర్గాలను విడదీసే ప్రయత్నంలో బాధిత మహిళ కూడా రోష్నీతో గొడవకు దిగింది. ఈ క్రమంలో రోష్నీ ఖేర్వార్​.. బాధితురాలిపై కోపం పెంచుకుంది. బాధితురాలు గౌరీ సర్కార్ సన్నిహితురాలు. ఘటన జరిగిన మరుసటి రోజు మళ్లీ పంచాయతీ సమావేశం నిర్వహించారు.

ఈ క్రమంలో రోష్నీ ఖేర్వార్​, తన సన్నిహితులు కలిసి.. బాధితురాలిపై దాడి చేశారు. పంచాయతీ సభ్యుల ఎదుటే గిరిజన మహిళను వివస్త్రను చేసిదారుణంగా కొట్టారు. ఈ సమయంలో పంచాయతీ పెద్దలు, గ్రామస్థులు ఉన్నా కూడా ఈ దారుణాన్ని ఎవరూ అడ్డుకోలేదు. దీంతో బాధితురాలు అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయింది. బాగ్డోగ్రా పోలీస్ స్టేషన్‌లో నిందితులపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. తనపై దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని నిందితులు బెదిరించారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
బంగాల్​లో జులై​ 20న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరోవైపు.. గిరిజన మహిళను వివస్త్రను చేసి దాడి చేయడం పట్ల ప్రజలు మండిపడుతున్నారు. నిందితులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details