తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కన్నతల్లి కర్కశత్వం.. ఏడ్చారని ఇద్దరు పిల్లలను చంపేసింది! - MH-WOMAN-CHILDREN-MURDER

మహారాష్ట్రలోని నాందేడ్​లో ఓ తల్లి దారుణానికి ఒడిగట్టింది. ఆహారం కోసం ఏడుస్తున్నారని నాలుగు నెలల పాప, రెండేళ్ల కొడుకును దారుణంగా చంపేసింది.

woman-strangles-infant-daughter-two-year-old-son-to-death-for-crying-burns-their-bodies
కన్నతల్లి కర్కశత్వం.. ఏడ్చారని ఇద్దురు పిల్లలను చంపేసింది

By

Published : Jun 3, 2022, 4:32 PM IST

పిల్లలకు తల్లిని మించిన భరోసా ఉండదు. అమ్మను మించిన ఆదరణ ఎక్కడా దొకరదు. తను తినకున్నా.. కన్నపిల్లల కడుపు నింపాలనే ఆశయంతో బతుకు పోరాటంలో సమిధలవుతున్న ఎందరో మాతృమూర్తులు ఉన్న ఈ సమాజంలో.. అమ్మతనానికే మచ్చతెచ్చె తల్లులు కూడా ఉన్నారు. తాజాగా మహారాష్ట్రలోని నాందేడ్​లో జరిగిన ఈ ఘటనను చూస్తే.. ఇలాంటి తల్లులు కూడా ఉంటారా? అనే సందేహం రాక మానదు.

నాందేడ్​లోని భోకర్​ తాలూకా పాండుర్నా గ్రామానికి చెందిన ధుర్పాదబాయి గణపత్ నిమల్వాడ్‌ అనే మహిళ.. తన నాలుగు నెలల పాప, రెండేళ్ల అబ్బాయిని దారణంగా హత్య చేసింది. మే 31, జూన్​1న వరుసగా ఈ హత్యలు చేసింది. తన సోదరుడు, తల్లితో కలిసి ఈ చిన్నారుల మృతదేహాలను పొలంలో కాల్చేసింది. ఈ మేరకు పోలీసులు నిందితురాలు ధుర్పాదబాయితో పాటు ఆమెకు సహకరించిన తల్లి కొండబాయి రాజేమోద్, సొదరుడు మాధవ్ రాజేమోద్​ను పోలీసులు అరెస్ట్​ చేశారు.

కారణమేంటి?: ఆహారం కోసం పిల్లలు ఏడ్చినందుకు ఈ ఘాతుకానికి ఒడిగట్టింది ధుర్పాదబాయి. మే 31న నాలుగు నెలల కూతురు ఏడుస్తుండగా.. గొంతు నులిమి చంపేసింది. తర్వాత రోజు.. రెండేళ్ల కొడుకు దత్తా.. ఆహారం కోసం ఏడ్చాడని.. అదే రీతిలో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు ముగ్గురిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.

మెట్రో స్టేషల్​లో లైంగిక వేధింపులు..
దిల్లీలోని ఓ మెట్రో స్టేషన్​లో తాను లైంగిక వేధింపులకు గురైనట్లు ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ట్విట్టర్​ వేదికగా ఆమెకు జరిగిన అన్యాయాన్ని మెట్రో అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. ఈ మేరకు దిల్లీ మెట్రో కార్పొరేషన్​ అధికారులతో పాటు, పోలీసులు స్పందించారు. అసలు జరిగిన విషయాన్ని ఆమె ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వరుస ట్వీట్లతో జరిగిన విషయాన్ని అంతా చెప్పేసింది.

"గురువారం మధ్యాహ్నం బాఘ్​ మెట్రో స్టేషన్‌లో నేను దిగగానే.. మెట్రో రైలు అడ్రస్​ అడిగే నెపంతో తన దగ్గరికి ఓ వ్యక్తి వచ్చాడు. నేను అతనికి సాయం చేశాను. అనంతరం నా సేష్టన్​ రాగానే నేను దిగి.. క్యాబ్ బుక్ చేసుకోవడానికి ప్లాట్‌ఫారమ్‌పై కూర్చున్నా. అదే వ్యక్తి మెట్రో ట్రైన్​ అడ్రస్​ కోసం మళ్లీ సంప్రదించాడు. ఈ క్రమంలో అతని జననాంగాలను నాకు చూపించే ప్రయత్నం చేశాడు." అని ట్వీట్‌లో ఆరోపించింది. తాను వెంటనే అక్కడ ఉన్న పోలీసు సిబ్బందిని సంప్రదించినా.. పట్టించుకోలేదని వివరించింది. ఈ ఘటన అంతా సీసీ టీవీలో రికార్డ్​ అయ్యిందని తాను అతనిని గుర్తు పడతానని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది ఆ మహిళ.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details