Son Stabbed His Mother in Gurugram: హరియాణా గురుగ్రామ్‌లో అమానవీయ ఘటన జరిగింది. ఓ వ్యక్తి తన సొంత తల్లి(66)నే కత్తితో పొడిచి దారణంగా హత్య చేశాడు. నిందితుడు ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్యతో కలిసి తల్లిదండ్రులకు దూరంగా వేరే ఇంట్లో నివసిస్తున్నాడు. అయితే.. తల్లీకొడుకుల మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో తల్లిపై కక్ష పెంచుకున్న కుమారుడు ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు.
కన్నతల్లినే కత్తితో పొడిచి చంపిన కిరాతకుడు - son murdered his mother in haryana
Son Stabbed His Mother in Gurugram: కన్నతల్లినే కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు ఓ కుమారుడు. ఈ ఘటన హరియాణాలోని గురుగ్రామ్‌లో జరిగింది.
హరియాణాలో తల్లిని చంపిన కుమారుడు
తల్లి ప్రతిరోజూ ఓ పార్కులో వాకింగ్‌కు వెళ్లేది. మాటువేసి ఆమెపై కత్తితో దాడి చేశాడు కుమారుడు. అతి కిరాతకంగా ఏడుసార్లు కత్తితో పొడిచాడు. అనంతరం ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు. బాధితురాలు రోడ్డుపై రక్తపు మడుగులో విలవిల్లాడింది. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.