తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పెళ్లి కావట్లేదని కక్ష- యువతిని 17 సార్లు పొడిచి హత్య - ప్రేమ వ్యవహారంలో హత్య

తాను గతంలో ప్రేమించిన యువతి కారణంగానే తనకు పెళ్లి కావట్లేదని ఓ యువకుడు కక్ష పెంచుకున్నాడు. దాంతో ఆ యువతిని దారుణంగా పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన కేరళలో జరిగింది.

women stabbed news
యువతి హత్య

By

Published : Aug 31, 2021, 12:48 PM IST

కేరళ తిరువనంతపురంలో దారుణం జరిగింది. ప్రేమ వ్యవహారంలో ఓ యువతిని(20) ఓ కిరాతకుడు హత్య చేశాడు. 17 సార్లు ఆమెను కత్తితో పొడిచాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సదరు యువతి ప్రాణాలు కోల్పోయింది.

ఏం జరిగింది?

నేదుమంగడ్​ ప్రాంతానికి చెందిన ఓ యువతి,​ పాయడ్​కు చెందిన అరుణ్​ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. కానీ, అదే సమయంలో మరొక వ్యక్తిని ప్రేమించిన యువతి.. అతడ్ని పెళ్లి చేసుకుంది. అయితే.. వారి మధ్య విభేదాలు తలెత్తగా.. ఆరునెలలుగా ఆ యువతి తన తల్లి వద్దే ఉంటోంది. మరోవైపు.. అరుణ్​ కుమార్.. ఆ యువతిని తాను గతంలో ప్రేమించినందునే తనకు పెళ్లి కావడం లేదని కక్ష పెంచుకున్నాడు.

నిందితుడు అరుణ్​ కుమార్​

"సోమవారం మధ్యాహ్నం యవతి ఇంటికి చేరుకున్న అరుణ్​.. ఆమెపై కత్తితో దాడి చేశాడు. యువతి శరీరంపై 17 కత్తిపోట్లు ఉన్నాయి. తీవ్రంగా గాయపడ్డ బాధితురాలిని హుటాహుటిన తిరువనంతపురం వైద్య కళాశాలకు తరలించాము. అక్కడ చికిత్స పొందుతున్న ఆమె.. మంగళవారం ఉదయం ప్రాణాలు కోల్పోయింది" అని పోలీసులు వెల్లడించారు.

దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. బాధితురాలి తల్లికి కూడా గాయాలయ్యాయి. దాడి సమయంలో యువతి తల్లిదండ్రులు అరవగా స్థానికులు.. అక్కడకు చేరుకున్నారు. వాళ్లను చూసిన నిందితుడు.. బాత్​రూంలో దాక్కున్నాడు. అయితే.. స్థానికులు అతడ్ని పట్టుకుని చితకబాదారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. నిందితుడ్ని కస్టడీకి తరలించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. విచారణ పూర్తయ్యాకే ఈ హత్య కారణాలపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:నడిరోడ్డుపై రణరంగం- ఏసీపీ వేళ్లు కత్తిరించిన వ్యాపారులు

ABOUT THE AUTHOR

...view details