తెలంగాణ

telangana

ETV Bharat / bharat

క్షుద్రపూజలతో మహిళ హత్య.. పేగులు తీసి.. ముక్కలుగా నరికి దహనం - గఢ్​వా న్యూస్​

Woman murdered her sister: క్షుద్రపూజల పేరుతో సొంత సోదరినే హత్య చేసింది ఓ మహిళ. ఈ హృదయవిదారక ఘటన ఝార్ఖండ్​లోని గఢ్​వా జిల్లాలో జరిగింది. ఈ ఘాతుకానికి పాల్పడ్డ మహిళ, ఆమె భర్త సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

woman murdered her sister
దహనం చేస్తున్న దృశ్యం

By

Published : Jun 27, 2022, 9:45 AM IST

Woman murdered her sister: మానవత్వం మంటగలిపే హృదయవిదారక ఘటన ఝార్ఖండ్​లోని గఢ్​వా జిల్లాలో జరిగింది. క్షుద్రపూజల పేరుతో సొంత సోదరినే హత్య చేసింది ఓ మహిళ. ఈ ఘాతుకానికి పాల్పడ్డ మహిళ, ఆమె భర్త సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నగర్​ ఉంటరి పోలీస్​స్టేషన్ పరిధిలోని దలేలి గ్రామంలో లలితాదేవి తన భర్త దినేశ్​ ఓరన్​తో కలిసి జీవిస్తోంది. వీరిద్దరు కలిసి ఓరన్​ తోలాలోని రాంశరన్​ నివాసానికి క్షుద్రపూజలు చేయడానికి వెళ్లారు. ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన లలితాదేవి సోదరి గుడియాదేవి, ఆమె భర్త మున్నాతో కలిసి వచ్చింది.

మృతదేహాన్ని దహనం చేస్తున్న దృశ్యం

గుడియాదేవి వచ్చిన వెంటనే లలిత మంత్రాలు చదవడం ప్రారంభించగా.. ఆమె భర్త గుడియాను కర్రతో కొట్టాడు. రక్తస్రావమై పడిపోయిన ఆమెను.. లలితా, ఆమె భర్త కలిసి ముక్కలు ముక్కలుగా నరికారు. అనంతరం ఆమె నాలుకను కత్తిరించారు. అక్కడితో ఆగకుండా ఆమె ప్రైవేట్​ భాగాలలో చేతులు పెట్టి పేగులను బయటకు తీశారు. ఇంత దారుణానికి పాల్పడుతున్న అక్కడే ఉన్న గుడియా భర్త సహా బంధువులంతా ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోయారు. అనంతరం ఆమె మృతదేహాన్ని అడవి మధ్యలోకి తీసుకెళ్లి దహనం చేశారు.

విచారణ చేస్తున్న పోలీసులు

ఈ ఘటనతో షాక్​ గురైన గుడియా భర్త మున్నా.. ఈ విషయాన్ని గ్రామ పెద్దలకు తెలియజేశాడు. దీంతో పంచాయితీ పెట్టగా.. వార్డు కౌన్సిలర్​ భర్త దీనిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారు. తర్వాత ఈ విషయం బయటకు రావడం వల్ల పోలీసులకు సమాచారం అందింది. గుడియా భర్త మున్నా పోలీస్​స్టేషన్​లో ఐదుగురిపై కేసు పెట్టాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దినేశ్​ ఓరన్​, రాంశరన్​ ఓరన్​, లలితాదేవి సహా ఐదుగురిని అరెస్ట్​ చేసినట్లు తెలిపారు. దీనిపై విచారణ వేగవంతం చేసినట్లు స్టేషన్ ఇంఛార్జి యోగేంద్ర కుమార్​ చెప్పారు.

ఇదీ చదవండి:పెళ్లి కోసం పాట్లు.. భార్య కావాలంటూ ఊరంతా పోస్టర్లు..

ABOUT THE AUTHOR

...view details