Woman Raped In Moving Train : చంటిబిడ్డతో కలిసి రైలు ప్రయాణం చేస్తున్న ఓ మహిళపై దారుణానికి పాల్పడ్డారు ఇద్దరు యువకులు. బోగీలో ఒంటరిగా ఉన్న మహిళపై అత్యాచారానికి ఒడిగట్టారు. బాధితురాలిని కట్టేసి.. ఆమె బిడ్డను రైలులో నుంచి బయటకు పడేస్తామని బెదిరించి ఈ దారుణానికి ఒడిగట్టారు. అసోంలోని గుహవాటి నుంచి బంగాల్లోని అలీపుర్ద్దార్ వెళ్లే.. సిఫాంగ్ ఎక్స్‌ప్రెస్‌లో శనివారం ఈ ఘటన జరిగింది. నిందితులిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత మహిళ తన బిడ్డతో పాటు అసోంలోని గుహవాటిలో శనివారం మధ్యాహ్నం సిఫాంగ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కింది. రైలు ఫకీరాగ్రామ్ వచ్చేసరిగా దాదాపు తోటి ప్రయాణికుంతా దిగిపోయారు. దీంతో మహిళ ప్రయాణిస్తున్న బోగీ దాదాపు ఖాళీ అయింది. సెక్యూరిటీ సిబ్బంది కూడా ఆ దరిదాపుల్లో ఎవ్వరూ లేరు. అదే బోగీలో ప్రయాణిస్తున్న నిందితులు.. దాన్నే అదునుగా తీసుకుని మహిళపై ఈ దారుణానికి పాల్పడ్డారు.
మొదట ఈ అఘాయిత్యంపై బాధిత మహిళ ప్రతిఘటించగా.. ఆమెను దారుణంగా కొట్టి కట్టేశారు నిందితులు. తమకు సహకరించకపోతే చిన్నారిని రైలు నుంచి బయటకు పడేస్తామని బెదిరించారు. రైలు అలీపుర్ద్దార్ జంక్షన్‌కు వచ్చిన అనంతరం రైల్వే పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. ఘటన మొత్తాన్ని వారికి వివరించింది. వెంటనే ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన పోలీసులు... శనివారం రాత్రి నిందితులను అరెస్ట్ చేశారు. వారిని అసోంలోని కోక్రాఝర్గఢ్కు చెందిన అబ్దు (25), మొయినుల్ హక్ (26)గా గుర్తించారు. మహిళ ఫిర్యాదు ఆధారంగా వీరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు పోలీసులు.