మహారాష్ట్రలో వెలుగుచూసిన ఈ దారుణం వింటే 2012లో జరిగిన నిర్భయ ఘటనను గుర్తుకుతెస్తుంది. ముంబయిలోని సకినాక సబ్ అర్బన్ ప్రాంతంలో 34 ఏళ్ల ఓ మహిళపై తన వాహనంలో అత్యాచారానికి పాల్పడ్డాడు మోహన్ చౌహాన్ అనే కిరాతకుడు. అంతటితో ఆగక.. మహిళ ప్రైవేట్ భాగాల్లో ఇనుప రాడ్‌ను దూర్చి చిత్రహింసలకు గురిచేశాడు.
ఏం జరిగిందంటే..?
శుక్రవారం ఉదయం ఖైరానీ రోడ్డు సమీపంలో ఓ మహిళ రక్తపు మడుగులో పడిఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. బాధితురాలిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మహిళపై అత్యాచారం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీస్ అధికారి తెలిపారు.
అంతేకాక బాధితురాలి ప్రైవేట్ భాగాల్లో ఇనుప రాడ్ దూర్చి చిత్రహింసలకు గురిచేసినట్లు తెలిపారు. రోడ్డుపక్కన నిలిపిఉన్న వాహనంలోనే నిందితుడు.. ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోందన్నారు.
ఇదీ చదవండి:మళ్లీ బతికొస్తాడని గంటలపాటు బురదలోనే మృతదేహం!