తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కస్టోడియల్ డెత్​పై జనాగ్రహం- మహిళా కానిస్టేబుల్​ మృతి - బిహార్ వార్తలు

తమ గ్రామస్థుడు కస్టడీలోనే మృతిచెందాడనే ఆగ్రహంతో పోలీసులపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు ప్రజలు. ఈ దాడిలో పలువురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఓ మహిళా కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన బిహార్​ జహానాబాద్​లో జరిగింది.

police public clash
జనాగ్రహం

By

Published : Jul 25, 2021, 7:57 AM IST

జనాగ్రహం

బిహార్​లో జుడీషియల్ కస్టడీలో ఉన్న ఓ వ్యక్తి జైలులో మృతిచెందటం వల్ల అతని గ్రామస్థుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వీరిని నిలువరించే ప్రయత్నంలో ఓ మహిళా కానిస్టేబుల్​ ప్రాణాలు కోల్పోగా, పలువురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.

జహానాబాద్​ జిల్లా పరస్​బిగా పోలీసు స్టేషన్​ పరిధిలో అక్రమ మద్యం కేసులో గోవింద్ మాంఝీని ఇటీవల అరెస్టు చేశారు. కోర్టు అతనికి జుడీషియల్ కస్టడీ విధించగా.. సమీపంలోని ఔరంగాబాద్​ జిల్లా జైలులో ఉంచారు. శుక్రవారం జైల్లోనే గోవింద్​ మృతిచెందాడు.

ఆయుధాలతో కాల్పులు..

పోలీసులు కొట్టడం వల్లే గోవింద్​ చనిపోయాడంటూ గ్రామస్థులు జహానాబాద్​- అర్వాల్​ జాతీయ రహదారిపై శనివారం ధర్నాకు దిగారు. గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించటంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు రాళ్లు, కర్రలతో దాడికి దిగారు.

కొందరు లైసెన్సు లేని ఆయుధాలతో కాల్పులు జరపటం వల్ల పరిస్థితి అదుపు తప్పింది. పలువురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. మహిాళా కానిస్టేబుల్​ను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందింది. దాడికి పాల్పడిన వారిలో ఐదుగురిని అరెస్ట్ చేశారు.

ఇదీ చదవండి:Tragedy: ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలి.. 9మంది మృతి

ABOUT THE AUTHOR

...view details