ఝార్ఖండ్ దుమ్కా జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. పెళ్లైన వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనే ఆరోపణతో ఓ మహిళ మెడలో చెప్పుల దండ వేసి నగ్నంగా ఊరేగించారు స్థానికులు. రానిశ్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు.
వివాహిత అయిన ఈ మహిళ పెళ్లైన మరో వ్యక్తితో పరారైంది. విషయం తెలుసుకున్న అతని భార్య తరఫు బంధువులు ఇద్దరినీ బుధవారం రాత్రి పట్టుకున్నారు. అనంతరం మహిళను దారుణంగా కొట్టి వివస్త్రను చేశారు. అనంతరం చెప్పుల దండతో ఊరేగించారు.