తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Woman Paraded : గిరిజన మహిళపై దారుణం.. నగ్నంగా మార్చి.. గ్రామమంతా ఊరేగించిన భర్త.. అత్తమామలు కూడా! - Rajasthan woman paraded

Woman Paraded In Rajasthan : గిరిజన మహిళను వివస్త్రను చేసి.. గ్రామంలో నగ్నంగా ఊరేగించాడు ఆమె భర్త. రాజస్థాన్​లో జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై సీఎం అశోక్​ గహ్లోత్​ స్పందించి.. కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Woman Paraded In Rajasthan
Woman Paraded In Rajasthan

By ETV Bharat Telugu Team

Published : Sep 2, 2023, 8:20 AM IST

Updated : Sep 2, 2023, 9:15 AM IST

Woman Paraded In Rajasthan : రాజస్థాన్​లోని ప్రతాప్​గఢ్​ జిల్లాలో దారుణం జరిగింది. గ్రామంలోని వేరే వ్యక్తితో మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆరోపిస్తూ.. వివస్త్రను చేసి నగ్నంగా ఊరేగించాడు ఆమె భర్త. అందుకు బాధితురాలి అత్తమామలు కూడా సహకరించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్​ కావడం వల్ల విషయం బయటపడింది.

డీజీపీ ఉమేశ్​ మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని ధరియావద్ పోలీస్​స్టేషన్​​ పరిధిలో గురువారం ఈ ఘటన జరిగింది. సోషల్​మీడియాలో వీడియో వైరల్​ కావడం వల్ల శుక్రవారం సాయంత్రం పోలీసులకు విషయం తెలిసింది. వెంటనే జిల్లా ఎస్పీతోపాటు పోలీస్​ సిబ్బంది గ్రామానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Woman Paraded Rajasthan : "బాధితురాలికి ఏడాది కిత్రం వివాహమైంది. ఆమె గ్రామంలో మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆమె అత్తమామలు, భర్త గత కొద్ది రోజులుగా ఆరోపిస్తున్నారు. గురువారం.. ఆమెను కిడ్నాప్​ చేసి తమ గ్రామానికి తీసుకెళ్లి అత్తమామలు, భర్తే ఈ దారుణానికి పాల్పడ్డారు. బాధితురాలిని ఆమె భర్త.. గ్రామంలో కిలోమీటర్​పాటు నగ్నంగా ఊరేగించాడు. బాధితురాలి భర్త తరఫున మరికొందరు బంధువులు కూడా ఈ ఘటనకు సహకరించారు" అని డీజీపీ తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్ట్​ చేసినట్లు ప్రతాప్​గఢ్ ఎస్పీ అమిత్ కుమార్​ తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు వెంబడించే క్రమంలో వారంతా గాయపడినట్లు చెప్పారు. వారు ప్రస్తుతం జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు.

కఠిన చర్యలు తీసుకుంటాం: సీఎం
ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​ స్పందించారు. నిందితులను వీలైనంత త్వరగా అరెస్ట్​ చేస్తామని తెలిపారు. "ఈ ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ను ఆదేశించాను. నాగరిక సమాజంలో ఇలాంటి నేరస్థులకు చోటు లేదు. ఈ నేరస్థులను వీలైనంత త్వరగా కటకటాల వెనక్కి నెట్టి శిక్షిస్తాము. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ జరుగుతోంది" అని సీఎం అశోక్​ గహ్లోత్​.. ఎక్స్​లో తెలిపారు.

మహిళను నగ్నంగా ఊరేగించిన ఘటనలో వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించినట్లు ధరియావాడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగరాజ్ మీనా తెలిపారు. "ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే నేను ధరియావాడ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాను. జిల్లా కలెక్టర్, ఎస్ఐతో చర్చించాను. పోలీసులు తక్షణమే చర్యలు తీసుకుంటారు" అని చెప్పారు.

వీడియో ఎవరూ షేర్​ చేయొద్దు
ఈ ఘటన రాజస్థాన్‌ను సిగ్గుపడేలా చేసిందని, బాధితురాలికి చెందిన వీడియోను ఎవరూ షేర్ చేయవద్దని మాజీ ముఖ్యమంత్రి వసుంధరరాజే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ నాయకుడు సతీశ్​ పూనియా.. ప్రతాప్‌గఢ్ ఘటనపై ట్వీట్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు సంబంధించి ముఖ్యమంత్రిను ప్రశ్నించారు. ప్రతాప్‌గఢ్‌లో గిరిజన మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వీడియో చూసిన తర్వాత తన ఆత్మ వణికిపోయిందని తెలిపారు. ఇలాంటి నేరాల గురించి తలచుకుంటేనే నేరస్థుల్లో భయం పుట్టించేలా దోషులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.

'గహ్లోత్​ సర్కార్​కు ప్రజలు గుణపాఠం చెబుతారు'
బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా.. ఎక్స్​(ట్విట్టర్​) వేదికగా రాజస్థాన్​ ఘటనపై స్పందించారు. "ప్రతాప్‌గఢ్​లో మహిళపై జరిగిన ఘటన దిగ్భ్రాంతికరం. అధ్వాన్నమైన విషయం ఏమిటంటే.. రాజస్థాన్‌లో పాలన పూర్తిగా లేదు. సీఎంతో పాటు మంత్రులు దిల్లీలోని ఒక రాజవంశాన్ని బుజ్జగించడంలో బిజీగా ఉన్నారు. రాష్ట్రంలో మహిళా భద్రతను పూర్తిగా విస్మరిస్తున్నారు. అక్కడ రోజూ మహిళలపై వేధింపులు జరుగుతున్నాయి. రాజస్థాన్ ప్రజలు రాష్ట్ర ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారు" అని నడ్డా ట్వీట్ చేశారు.

ప్రతాప్‌గఢ్‌లో జరిగిన దారుణ ఘటనను జాతీయ మహిళా కమిషన్ ఖండించింది. రెండు రోజుల క్రితమే ఘటన జరిగినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమని ఆరోపించింది. 5 రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని పోలీసులకు ఎన్‌సీడబ్ల్యూ చీఫ్ రేఖా శర్మ ఆదేశించారు.

నగ్నంగా మహిళల ఊరేగింపు.. ఆ రోజు మణిపుర్​లో అసలేం జరిగింది?

గిరిజన మహిళపై దారుణం.. నగ్నంగా మార్చి.. చితకబాది..

Last Updated : Sep 2, 2023, 9:15 AM IST

ABOUT THE AUTHOR

...view details