రాజస్థాన్‌లో దారుణ హత్య (Rajasthan news today) జరిగింది. గేదెలను మేపేందుకు వెళ్లిన ఓ మహిళను కిరాతకంగా చంపాడు (Woman Murdered) ఓ దుండగుడు. గొడ్డలితో నరికి ప్రాణాలు తీశాడు. మృతి చెందిన మహిళ కాళ్లను నరికేసి.. వెండి కడియాలను దోచుకెళ్లాడు. జైపుర్‌లోని జమ్వా రామ్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
మృతురాలిని ఖాతేపురాకు చెందిన గీతా దేవి(50)గా గుర్తించారు. మహిళ మెడపై పలుమార్లు గొడ్డలితో దాడి చేసినట్లు తెలుస్తోంది. మహిళ ఆభరణాలను తీసుకొని నిందితుడు పరారయ్యాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. డీఎస్పీ లఖన్ సింగ్ మీనా సైతం ఆ ప్రాంతానికి వెళ్లారు. మృతదేహం పడి ఉన్న ప్రాంతం నుంచి ఆధారాలు సేకరించారు.