తెలంగాణ

telangana

ETV Bharat / bharat

28 వెడ్స్​ 14- పేరెంట్స్​కు తెలియకుండా మ్యారేజ్​, పుట్టింటికి పంపించనని వింత వాదన! - మైనర్​తో మహిళ వివాహం

Woman Married Minor Una : 14 ఏళ్ల బాలుడితో ప్రేమలో పడింది 28 ఏళ్ల మహిళ. అనంతరం అతడిని బలవంతంగా పెళ్లి చేసుకుంది. ఈ విషయమై బాధితుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్​లోని ఉనా జిల్లాలో జరిగింది.

Una minor marriage case
Una minor marriage case

By ETV Bharat Telugu Team

Published : Dec 29, 2023, 10:18 AM IST

Updated : Dec 29, 2023, 11:26 AM IST

Woman Married Minor Una :28 ఏళ్ల మహిళ 14 ఏళ్ల బాలుడితో ప్రేమలో పడింది. బాలుడిని సొంతం చేసుకోవాలనుకున్న ఆశతో బలవంతంగా అతడిని పెళ్లి చేసుకుంది. ఈ విషయమై బాధితుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిమాచల్​ప్రదేశ్​లోని ఉనా జిల్లాలో జరిగిన ఈ ఘటనపై సర్వత్రా చర్చనీయాంశమైంది.

ఇదీ జరిగింది!
ఉపాధి కోసం బిహార్​ నుంచి వలస వచ్చిన 28 ఏళ్ల మహిళ ఉన్నా జిల్లాలోని ఓ ప్రాంతంలో నివసిస్తోంది. అదే రాష్ట్రం నుంచి వలస వచ్చిన మరో కుటుంబం ఆ మహిళ పొరుగింట్లో చాలా కాలం నుంచి నివాసం ఉంటోంది. ఈ క్రమంలో పొరుగింట్లో ఉండే 14 ఏళ్ల బాలుడితో సదరు మహిళ ప్రేమలో పడింది. అతడిని సొంతం చేసుకోవాలని పెళ్లి కూడా చేసుకుంది. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే బాలుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తమ కుమారుడిని అపహరించి బలవంతంగా ఆ మహిళ వివాహం చేసుకుందని బాలుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. అలాగే తమ కుమారుడిపై మహిళ దాడి కూడా చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ కుమారుడు మైనర్ అని, అతడికి న్యాయం చేయాలని కోరారు. తమ కుమారుడిని ఇంటికి తీసుకొచ్చేందుకు మహిళ ఇంటికి వెళ్లగా ఆమె దురుసుగా సమాధానం చెప్పిందని బాలుడి తల్లిదండ్రులు తెలిపారు. బాలుడిని పంపించబోనని, అధికారికంగా బాలుడిని వివాహం చేసుకున్నానని చెబుతోందని, బాలుడిపై తనకు కూడా హక్కు ఉందని వాదిస్తోందని అన్నారు.

ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇరు వర్గాలకు నోటీసులు జారీ చేశారు. ఉనా మహిళా పోలీస్​ స్టేషన్​కు పిలిపించి ప్రశ్నించారు. ఉనా ఏఎస్పీ సంజీవ్ భాటియా కూడా ఈ విషయంపై స్పందించారు. 'ఈ విషయంపై ఫిర్యాదు అందింది. ఓ 28 ఏళ్ల మహిళ, తన 14 ఏళ్ల కుమారుడిని వివాహం చేసుకున్నట్లు బాధితుడి తండ్రి చెప్పారు. ఇరువర్గాలు బిహార్​కు చెందినవారు. పోలీసులు ఇరువర్గాలను విచారించారు. ఈ కేసులో విచారణ జరిపిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాం' అని సంజీవ్ భాటియా వెల్లడించారు.

13 ఏళ్లతో బాలుడితో గర్భం దాల్చిన 31 ఏళ్ల మహిళ
ఇంట్లో పని ఉందని, అందుకు సాయం చేయాలని చెప్పి 13 ఏళ్ల బాలుడికి వల వేసింది ఓ 31 ఏళ్ల మహిళ. అతడిపై ఉన్న వ్యామోహంతో ఇంటికి పిలుచుకొని శారీరక సంబంధం ఏర్పర్చుకుంది. చుట్టుపక్కల వారంతా వారిద్దరిని తల్లీకుమారులని భావిస్తుండగా ఆ మహిళ గర్భం దాల్చడం వల్ల గుట్టురట్టైంది. చివరికి కోర్టు షాకింగ్​ తీర్పు ఇచ్చింది. ఈ ఘటన ఎక్కడ జరిగింది? కోర్టు ఇచ్చిన ఆ షాకింగ్​ తీర్పు ఏంటో తెలుసుకోవాలంటే ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

మేనల్లుడిపై అత్త అత్యాచారం- ఏడాదిగా అలానే!- ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరింపులు

నలుగురి పిల్లల తల్లితో యువకుడి ప్రేమాయణం- ఇంటికి పిలిచి ప్రైవేట్​ భాగాలు కట్​ చేసిన లవర్​!

Last Updated : Dec 29, 2023, 11:26 AM IST

ABOUT THE AUTHOR

...view details