Bareilly Love Marriage: ఉత్తర్ప్రదేశ్ బరేలీలో ఓ యువతి ప్రేమించిన ప్రియుడిని మతాంతర వివాహం చేసుకుంది. పెళ్లి వీడియోను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసింది. తను ప్రేమ పెళ్లి చేసుకోవడం ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదని, తమకు వారి నుంచి ప్రాణ హాని ఉన్నందువల్లే వీడియోను షేర్ చేస్తున్నట్లు చెప్పింది. తమకు ఏదైనా జరిగితే వారిదే బాధ్యత అని చెప్పింది. ఇద్దరికీ రక్షణ కల్పించాలని పోలీసులకు విజ్ఞప్తి చేసింది.
Bareilly News: బాబీ అనే యువకుడిని మూడెేళ్లుగా ప్రేమిస్తోంది లుబ్నా అనే యువతి. ఇద్దరిదీ బరెలీలోని కోత్వాలి ప్రాంతమే. అయితే మతాలు వేరు. తమ ప్రేమ విషయం తెలిస్తే తల్లిదండ్రులు ఒప్పుకోరని తెలిసి లుబ్నా ఇంటి నుంచి వెళ్లిపోయింది. మే 20న బాబీని హిందూ సంప్రదాయం ప్రకారం ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకుంది. అనంతరం ఇష్టపూర్వకంగానే మతం మార్చుకుంది. పేరు కూడా మార్చుకుని ఆరోహి అని పెట్టుకుంది.
పెళ్లి వీడియో వైరల్ చేసిన యువతి.. అయితే తమ తల్లిదండ్రులకు మతం పట్టింపులు ఎక్కువని, ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లికి ఒప్పుకోరని తెలిసే ఇళ్లు వదిలి వచ్చినట్లు ఆరోహి చెప్పింది. తన పెళ్లి జరిగిందని తెలిస్తే కుటంబసభ్యులు తమకు చంపేందుకు కూడా వెనుకాడరని పేర్కొంది. అందుకే వీడియో షేర్ చేసి అందరికీ ఈ విషయం తెలిసేలా చేసినట్లు పేర్కొంది. దీని వల్ల తమకు ఏదైనా జరిగితే బాధ్యులెవరో తెలుస్తుందని వివరించింది. తామిద్దరం ప్రేమించుకుని ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నట్లు బాబీ కూడా తెలిపాడు. పరస్పర అంగీకారంతో జరిగిన పెళ్లి కాబట్టి ఎవరికీ సమస్య లేదని భావిస్తున్నట్లు చెప్పాడు.
పెళ్లి వీడియో వైరల్ చేసిన యువతి మరోవైపు అమ్మాయి తల్లిదండ్రులు తమ కూతురు కన్పించట్లేదని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. పెళ్లి వీడియో వైరల్ అయిన సమయంలోనే ఈ ఫిర్యాదు చేశారు. అయితే ప్రేమ పెళ్లి చేసుకున్న ఆరోహి, బాబీకి వారి విజ్ఞప్తి మేరకు రక్షణ కల్పిస్తామని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:పెళ్లైన కాసేపటికే వరుడుకి దిమ్మతిరిగే షాక్.. ఆమె అతడని తెలిసి..