తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కొవిడ్​ భయంతో మూడేళ్లుగా ఇంట్లోనే..! భర్తను కూడా రానివ్వకుండా కుమారుడితో.. - కొవిడ్ వైరస్ భయంతో మూడేళ్లుగా ఇంట్లోనే కుటుంబం

కొవిడ్ భయంతో మూడేళ్లుగా బయటకి రాకుండా ఇంట్లోనే ఉండిపోయింది ఓ మహిళ. తన 11 ఏళ్ల కుమారుడిని సైతం ఇంట్లో నుంచి బయటకు రానియ్యలేదు. భర్త ఎంత చెప్పినా వినలేదు. దీంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పడు తల్లీకుమారుడిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

woman locked herself son
కొవిడ్ భయంతో ఇంట్లో నుంచి బయటకు రాని మహిళ

By

Published : Feb 23, 2023, 8:52 AM IST

Updated : Feb 23, 2023, 12:11 PM IST

కొవిడ్​ భయంతో మూడేళ్లుగా ఇంట్లోనే..! భర్తను కూడా రానివ్వకుండా కుమారుడితో..

మూడేళ్ల క్రితం వచ్చిన కొవిడ్ వైరస్​ ప్రపంచాన్ని వణికించింది. ఆ వైరస్ ధాటికి ఇప్పటికీ కొందరు భయపడుతూనే ఉన్నారు. ఇల్లు దాటి బయటకు వచ్చేందుకు సైతం జంకుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే హరియాణా.. గురుగ్రామ్​లో జరిగింది. గత మూడేళ్లుగా ఓ తల్లి.. తన 11 ఏళ్ల కుమారుడితో కలిసి ఇంట్లోనే ఉంటోంది. తన భర్తను సైతం ఇంట్లోకి రానివ్వట్లేదు. ఆ కథేంటో తెలుసుకుందాం.

గురుగ్రామ్​.. మారుతీ విహార్​కు చెందిన మున్​మున్​ అనే మహిళ తన భర్త, 11 ఏళ్ల కుమారుడితో కలిసి నివసించేది. అయితే కొవిడ్ వచ్చినప్పటి నుంచి ఆమె తన కుమారుడితో కలిసి ఇంట్లోనే ఉంటోంది. తాను బయటకు రావట్లేదు. తన కుమారుడిని కూడా బయటకి వెళ్లనియ్యట్లేదు. తన భర్తను ఇంట్లోకి రానివ్వట్లేదు. గత మూడేళ్లుగా ఇదే పరిస్థితి. బంధువులు, స్నేహితుల ఇంట్లో కొన్నాళ్లు పాటు తలదాచుకున్న భర్త.. భార్య వైఖరిలో మార్పు వస్తుందని ఆశపడ్డాడు. ఎంతకీ ఆమె మారకపోవడం వల్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆరోగ్య సిబ్బంది, పోలీసులు.. ఇంటి తలుపులు పగలగొట్టి తల్లీకుమారుడిని ఆస్పత్రికి తరలించారు. మున్​మున్​ భర్త.. ఆమెకు, కుమారుడికి భోజనం, నీరు ఏర్పాటు చేసేవాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. తాను కొన్నాళ్లుగా వేరే ఇంట్లో అద్దెకు ఉంటున్నానని మున్​మున్ భర్త తెలిపాడు. కొవిడ్ ముగిసిందని తన భార్యను ఒప్పించే ప్రయత్నం చేసినా ఆమె వినలేదని చెప్పాడు.

మూడేళ్లగా వాడిన సామన్లు

మున్​మున్​ కుటుంబం గత 8 ఏళ్లుగా మారుతీ విహార్​లో నివాసం ఉంటోంది. ఈ కుటుంబం గత కొన్నాళ్లుగా ఇరుగుపొరుగు వారిని కూడా కలవలేదు. దీంతో కొవిడ్ టైంలో మున్​మున్ కుటుంబం తమ స్వగ్రామానికి వెళ్లిపోయిందని అందరూ భావించారు. కరోనాకు ముందు మున్​మున్ కుమారుడు స్కూల్​కు వెళ్లేవాడు. ఆ తర్వాత ఆ బాలుడు స్కూల్​కు వెళ్లడం లేదు. ఇరుగుపొరుగు వారికి కనిపించడం లేదు. కాగా.. పిల్లవాడు తన తాతగారింటికి వెళ్లాడేమోనని ఇరుగుపొరుగువారు భావించారు. అయితే పోలీసులు, ఆరోగ్య బృందం తల్లీ కొడుకును రక్షించడం వల్ల ఇరుగుపొరుగువారికి అసలు విషయం తెలిసింది.

చిందరవందరగా ఉన్న మున్​మున్​ రూమ్​

'మహిళ మానసిక పరిస్థితి బాగా లేదు. ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉంది. బాలుడి పరిస్థితి కూడా దాదాపు అంతే. మహిళకు ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స చేస్తున్నాం. బాలుడికి మెరుగైన వైద్యం అవసరం. అందుకే రోహ్తక్​కు తరలించారు.' అని వైద్యుడు వీరేంద్ర యాదవ్ తెలిపారు.

మున్​మున్​ రూమ్
Last Updated : Feb 23, 2023, 12:11 PM IST

ABOUT THE AUTHOR

...view details