తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మూగజీవాలపై 'మహిళ' కర్కశత్వం.. రాత్రిళ్లు వెంటాడి, వేటాడి మరీ! - కుక్కపిల్లలపై కిరాతకంగా

Woman killed Dogs pup Pune: ఓ మహిళ మూగజీవాలపై కర్కశంగా ప్రవర్తించింది. రాత్రిళ్లు వేటాడి రెండు కుక్క పిల్లలను చంపింది. సంబంధిత దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు వాటిని ఎందుకు చంపిందంటే?

Woman killed Dog Puppies Out of Anger
Woman killed Dog Puppies Out of Anger

By

Published : Apr 13, 2022, 4:02 PM IST

Woman killed Dogs pup Pune: మనుషులు రానురానూ మానవత్వాన్ని మరచిపోతున్నారు. మూగజీవాలపైనా కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నారు. మహారాష్ట్ర పుణెలోని హడ్పసర్​లో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ పట్టరాని కోపంతో.. రెండు కుక్క పిల్లలను వేటాడి చంపింది. ఆమె కర్ర పట్టుకొని రాత్రిళ్లు వీధుల్లో తిరిగిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. స్థానికంగా ఉండే ఓ మహిళ ఫిర్యాదు మేరకు.. నిందితురాలు అనితా దిలీప్​ ఖాప్టేపై పోలీసులు కేసు నమోదు చేశారు.

చనిపోయిన కుక్క పిల్లలు

అసలేమైందంటే? కొద్దిరోజుల కిందట.. నిందితురాలు అనిత చిన్న కుమార్తెను ఓ శునకం కరిచింది. దీంతో పగ పెంచుకున్న ఆమె వాటిని చంపేయాలని, ఏ కుక్కనూ వదలొద్దని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే పెద్ద కర్ర పట్టుకొని వీధులంతా తిరుగుతూ రెండు చిన్న పిల్లల్ని చంపేసింది. దీనిపై ఓ మహిళ పోలీసులను ఆశ్రయించగా.. వారు నిందితురాలిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

సీసీటీవీలో నమోదైన మహిళ దృశ్యాలు

ABOUT THE AUTHOR

...view details