తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Woman Killed and Burnt in Shamshabad : శంషాబాద్‌లో దారుణం.. మహిళను చంపేసి కాల్చేశారు - మహిళపై పెట్రోల్ పోసి నిప్పుటించిన దుండగులు

woman killed and burnt in Shamshabad
Woman brutal murder in Shamshabad

By

Published : Aug 11, 2023, 8:30 AM IST

Updated : Aug 11, 2023, 2:28 PM IST

08:25 August 11

Woman Killed and Burnt in Shamshabad : శంషాబాద్‌లో దారుణం.. మహిళను హత్య చేసి పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు

Woman Killed and Burnt in Shamshabad శంషాబాద్‌లో దారుణం.. మహిళను హత్య చేసి పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు

Woman Killed and Burnt in Shamshabad :నాలుగేళ్ల క్రితం షాద్‌నగర్‌ సమీపంలో చోటుచేసుకున్న దిశ హత్యోదంతంతరహాలోనే శంషాబాద్‌లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని మహిళను అర్ధరాత్రి వేళ కిరాతంగా చంపేసిన ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది. సాయి ఎన్‌క్లేవ్‌లోని ఇళ్ల మధ్య రాత్రి ఒంటి గంట ప్రాంతంలో కాలుతున్న వాసన రావటంతో స్థానికులు నిద్రలేచారు. ఇళ్ల మధ్యనున్న ఖాళీ ప్రదేశంలో ఓ చోట మండుతుండటంతో అనుమానం వచ్చి దగ్గరకు వెళ్లగా... దారుణం వెలుగులోకి వచ్చింది.

Shmshabad Woman Murder Case : స్థానికుల సమచారంతో ఘటనాస్థలికి పోలీసులు చేరుకునేలోగా మృతదేహం పూర్తిగా కాలిపోయింది. ఆమె ఒంటిపై గుర్తించిన మెట్టెలు, గాజులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొత్తగా నిర్మాణాలు చేపడుతున్న ప్రదేశంలో జనసంచారం తక్కువ ఉండటంతో దుండగులు ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నట్లు స్థానికులు భావిస్తున్నారు. ఉదయం రంగంలోకి దిగిన క్లూస్‌టీం హత్య జరిగిన చోట ఆధారాలు సేకరించాయి. మృతదేహం పూర్తిగా కాలిపోయినందున గుర్తించటం కష్టంగా మారింది. మహిళపై అత్యాచారం చేసి..! హత్య చేశారా..! లేదంటే సజీవంగా కాల్చేశారా..! అనేది స్పష్టత రాలేదని పోలీసులు చెబుతున్నారు.

మరో దారుణం.. యువతిని చంపి, బావిలో శరీర భాగాలు పడేసి..

ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించే క్రమంలో ఇద్దరు అనుమానితులను గుర్తించారు. తొండుపల్లి బంక్‌ వద్దకు ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు బాటిల్‌లో పెట్రోల్‌ నింపుకుని వెళ్లారు. ఈ ఇద్దరు వ్యక్తులే మహిళను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు హత్యకు గురైన మహిళ ఎవరనేదానిపైనా పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.

Woman Murder Case In Shmshabad :మృతురాలు ఇతర రాష్ట్రానికి చెందిన మహిళ ప్రాథమిక భావిస్తున్న పోలీసులు కాలికి మెట్టెలు ఉన్నందున వివాహితగా అనుమానిస్తున్నారు. చుట్టుపక్కల పోలీస్‌ స్టేషన్‌లలో ఏమైనా అదృశ్య కేసులు నమోదయ్యాయా అనే సమాచారం సేకరిస్తున్నారు. దిశ తరహాలోనే జరిగిన ఈ ఘటనను సవాల్‌గా తీసుకున్న పోలీసులు వీలైనంత త్వరగా నిందితులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.

మరోవైపు మహిళ హత్యకు సంబంధించి ఇద్దరి వ్యక్తులను పోలీసులు గుర్తించారు. వారిని అదపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఘటన జరిగిన కొద్ది దూరంలోనే ఇద్దరు యువకులు ప్రెట్రోల్‌ బంక్‌లో బాటిల్‌తో ప్రెటోల్‌ కొనడం.. దానిని అనుమానంగా తీసుకెళ్లడం వంటి దృశ్యాలు నమోదయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి వారిపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వారు ఎక్కడి వారు..! వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

యువతిని చంపి, మృతదేహాన్ని తగులబెట్టిన కుటుంబం.. తమిళనాడులో బిహార్​ కూలీ హత్య!

"మహిళ మృతదేహం కాలిపోతుందని అర్ధరాత్రి మాకు సమాచారం వచ్చింది. వెంటనే సంఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించాం. గుర్తు తెలియని మహిళను పెట్రోల్ పోసి తగులపెట్టారు. మహిళను హత్య చేసి తగులు పెట్టారా లేకపోతే.. సజీవ దహనంచేశారా అనేది పోస్టుమార్టం తర్వాత తెలుస్తుంది. మహిళ ఎవరనే వివరాలు సేకరిస్తున్నాం. చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇచ్చాం. చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లో మహిళ కనిపించడం లేదని ఫిర్యాదులు ఏమైనా వచ్చాయా అనే దానిపై ఆరా తీస్తున్నాం. నిందితుడిని గుర్తించేందుకు నాలుగు బృందాలు ఏర్పాటు చేశాం. చుట్టుపక్కల ఉన్న సిసి కెమెరాలను పరిశీలిస్తున్నాం". -రామ్ చందర్ రావు, శంషాబాద్ ఏసీపీ

Korutla BRS Councillor Husband Murder : కోరుట్లలో కలకలం.. బైక్​పై వచ్చి బీఆర్​ఎస్ కౌన్సిలర్ భర్తను నరికేశారు

Congress Leader Son Killed his Wife : భార్య హత్య.. ఆపై సాక్ష్యాల చెరిపివేతకు యత్నం.. యూత్​ కాంగ్రెస్​ లీడర్ అరెస్ట్

Women Blackmail Case in Hyderabad : రూ.లక్షలు ఇస్తానంటూ మత్తులోకి దించి.. నగ్నంగా చిత్రీకరించి.. ఆపై బెదిరింపులు

Last Updated : Aug 11, 2023, 2:28 PM IST

ABOUT THE AUTHOR

...view details