తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఐదుగురు పిల్లలతో బావిలో దూకి మృత్యుఒడికి.. - రాజస్థాన్ కోటా న్యూస్​

భర్తతో గొడవపడిన ఓ మహిళ దారుణానికి ఒడిగట్టింది. ఐదుగురు కుమార్తెలతో సహా బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన రాజస్థాన్​లో జరిగింది.

Woman jumped into a well
ఐదుగురు పిల్లలతో సహా బావిలో దూకిన మహిళ

By

Published : Dec 5, 2021, 1:56 PM IST

రాజస్థాన్​లో అత్యంత విషాద ఘటన జరిగింది. భర్తతో గొడవపడిన ఓ మహిళ ఘోర నిర్ణయం తీసుకుంది. తన ఐదుగురు కుమార్తెలతో సహా బావిలో దూకి శనివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది.

అసలేమైందంటే..

కోటా జిల్లా కాలియాఖేడీ గ్రామానికి చెందిన శివలాల్​, బాదమ్ దేవీ దంపతులకు ఐదుగురు పిల్లలు సంతానం. ఇటీవల కొద్దిరోజులుగా భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బాదమ్​ దేవీ తన ఐదుగురు కుమార్తెలతో సహా శనివారం రాత్రి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో సావిత్రి(14), అంజలి(8), కాజల్(6), గుంజన్​(4), అర్చన(1) మృతి చెందారు. ఈ మేరకు పోలీసులు తెలిపారు.

ఈ ఆత్మహత్య సమచారం తెలుసుకున్న వెంటనే... రామ్​గంజ్ మండీ డిప్యూటీ ఎస్పీ ప్రవీణ్ నాయక్​, సీఐ రాజేంద్ర ప్రసాద్​, ఇతర అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. గ్రామస్థుల సాయంతో బావిలో నుంచి మృతదేహాలను బయటకు తీసి, పోస్టుమార్టం కోసం మోదక్ ఆస్పత్రికి తరలించారు.

భార్యభర్తల మధ్య తలెత్తిన గొడవ కారణంగానే సదరు మహిళ తన పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి:టీకా తీసుకోమన్నందుకు రాయితో కొట్టబోయిన వృద్ధుడు- వీడియో వైరల్​

ABOUT THE AUTHOR

...view details