ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది ఓ మహిళ. అసోంలోని కామ్రూప్ జిల్లా రంగియాలో ఈ అరుదైన సంఘటన జరిగింది. బుధవారం ఆ మహిళ ఇద్దరు బాలికలు, ఇద్దరు అబ్బాయిలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఒకే కాన్పులో నలుగురు శిశువుల జననం! - ఒకే కాన్పులో నలుగురికి జన్మనిచ్చిన మహిళ
ఒకే కాన్పులో ఏకంగా నలుగురు శిశువులు జన్మించిన అరుదైన ఘటన అసోంలో జరిగింది. ఈ కాన్పులో ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగబిడ్డలకు జన్మనిచ్చింది ఓ మహిళ. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
ఒకే కాన్పులో నలుగురు శిశువుల జననం!
రాష్ట్రంలో తీవ్రమైన భూకంపం సంభవించిన రోజే ఆసుపత్రిలో నలుగురు పిల్లలకు జన్మనివ్వడం విశేషమని వైద్యురాలు హితేంద్ర ఖలిత తెలిపారు. ఈ కాన్పు పట్ల కుటుంబ సభ్యులతో పాటు.. ఆసుపత్రి సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు.