ఓ చిన్నారిని చంపి అనతరం రక్తం తాగింది ఓ మహిళ. ఈ ఘటన ఐదు సంవత్సరాల కింద జరగగా తాజాగా ఆమెకు జీవిత ఖైదు పడింది. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్లో జరిగింది. క్షుద్రపూజల పేరుతో ఓ మాంత్రికుడు చెప్పిన మాటలు నమ్మి ఈ దారుణానికి పాల్పడింది. ఈ కేసులో ఆమెకు సహకరించిన మరో ఇద్దరికి జిల్లా కోర్టు అదే శిక్షను విధించింది.
చిన్నారిని చంపి రక్తం తాగిన మహిళ.. పిల్లలు లేరనే కారణంతోనే! - షాజహాన్పుర్ లేటెస్ జీవిత ఖైదు న్యూస్
ఉత్తర్ప్రదేశ్లో జిల్లా కోర్టు ఓ మహిళతో పాటు మరో ఇద్దరికి జీవిత ఖైదుని విధించింది కోర్టు. ఐదేళ్ల క్రితం ఓ బాలుడ్ని చంపి రక్తం తాగిన కేసులో వారికి ఈ శిక్షను విధించింది. అసలు ఏం జరిగిందంటే!
అసలు ఏం జరిగిందంటే..
షాజహాన్పుర్ జిల్లాలోని రోజా పోలీస్స్టేషన్ పరిధిలోని జముకా గ్రామంలో ఓ మహిళ.. పదేళ్ల బాలుడ్ని చంపి రక్తం తాగింది. 2017 డిసెంబర్ 5న ధన్దేవి అనే మహిళ ఈ దారుణానికి పాల్పడింది. తన పొరుగింట్లో ఉండే లాల్దాస్ అనే పదేళ్ల చిన్నారికి.. టీవీ చూపిస్తానని మాయమాటలు చెప్పి ఇంట్లో పెట్టి తాళం వేసింది. అనంతరం క్షుద్రపూజలు నిర్వహించి బాలుడు గొంతు కోసి హత్య చేసింది. ఆ తర్వాత చెంపను కోసి రక్తాన్ని తాగి.. మృతదేహాన్ని ఇంటి ముందు పడేసింది. అయితే చిన్నారి మృతదేహం వద్ద కుంకుమ, గాజులతో పాటు మరికొన్ని క్షుద్రపూజకు సంబంధించిన వస్తువులు ఉన్నాయి. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ హత్యలో సంబంధం ఉన్న ధన్దేవీతో పాటు మరో ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వారందరికీ స్థానిక జిల్లా కోర్టు శుక్రవారం జీవితఖైదుని విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ కేసులో ఐదేళ్ల తర్వాత చిన్నారి కుటుంబ సభ్యులకు న్యాయం జరిగింది.
మాంత్రికుడి మాటలు నమ్మిన నిందితురాలు..
పోలీసులు నిందితురాలిని విచారించగా ఈ హత్య వెనుకున్న అసలు నిజం బయటపడింది. దేవికి పిల్లలు లేరని.. ఓ మంత్రగాడిని సంప్రదించగా తన చేతులతో వేరొకరి బిడ్డను త్యాగం చేసి.. ఆ బిడ్డ రక్తం తాగాలని సూచించాడు. అలా చేస్తేనే పిల్లలు పుడతారని తెలిపాడు. తాంత్రికుడు మాటలు నమ్మిన దేవీ.. ఈ నేరానికి పాల్పడినట్లు ఒప్పుకుంది. ఈ హత్యలో మరో ఇద్దరికి భాగం ఉన్నట్లు వెల్లడించింది. వారందరికి కోర్టు శిక్షను విధించింది.