Woman Gave Birth To Three Children: ఉత్తర్‌ప్రదేశ్ మీరట్‌లో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. మీరట్ వైద్య కళాశాలలో ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. దుర్గానగర్‌కు చెందిన నైనా.. ఒకే కాన్పులో ముగ్గురికి జన్మనిచ్చింది. అందులో ఇద్దరు మగ, ఒక ఆడ శిశువు ఉన్నారు. ఓ బాలుడు 2 కిలోల బరువున్న బాలుడు ఆరోగ్యంగా ఉండగా తల్లికి అప్పగించారు.
ఒకే కాన్పులో ముగ్గురు శిశువుల జననం..తల్లీబిడ్డలు క్షేమం - woman gave birth to three children
Woman Gave Birth To Three Children: ఓకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మినిచ్చింది ఓ మహిళ. ఈ అరుదైన సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగింది. కాగా శిశువులందరూ ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.
మరో బాలుడు 1.9 కిలోలు, బాలిక 1.5 కిలోల బరువు ఉండటం వల్ల ఇంక్యూబేటర్లో(ఎన్ఐసీయూ) ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. అయితే.. ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారని.. బరువు తక్కువ ఉండటం వల్లే ఎన్ఐసీయూలో పెట్టామని చెప్పారు. త్వరలోనే పిల్లలిద్దరిని తల్లికి అప్పగిస్తామన్నారు. ఒకే సారి ముగ్గురు పిల్లలు జన్మించడం పట్ల కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. పురుడుపోసిన డాక్టర్ అరుణ బృందాన్ని వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఆర్సీ గుప్తా అభినందించారు.
ఇదీ చదవండి:'ఆరోగ్య భారతం.. పదేళ్లలో రికార్డు స్థాయికి వైద్యుల సంఖ్య'