తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒకే కాన్పులో నలుగురికి జన్మ- అందరూ ఆడపిల్లలే- అంబులెన్సులోనే మహిళకు నార్మల్ డెలివరీ - అంబులెన్సులో ప్రసవించిన మహిళ

Woman Gave Birth To Quadruplets Inside Ambulance : అంబులెన్సులోనే ఓ మహిళ నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. శిశువులంతా ఆడపిల్లలేనని వైద్యులు తెలిపారు. వారంతా ఆరోగ్యంగానే ఉన్నట్లు చెప్పారు.

Woman Gave Birth To Quadruplets Inside Ambulance
Woman Gave Birth To Quadruplets Inside Ambulance

By ETV Bharat Telugu Team

Published : Dec 22, 2023, 9:56 PM IST

Updated : Dec 22, 2023, 10:33 PM IST

Woman Gave Birth To Quadruplets Inside Ambulance :అసోంలోని తీన్​సుకియా జిల్లాలో ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. 108 అంబులెన్సులోనే మహిళ ప్రసవించింది. చిన్నారులంతా ఆడపిల్లలే కావడం విశేషం. వీరంతా ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు స్పష్టం చేశారు.

సైఖోవా ధాలా ప్రాంతంలోని నౌకాటా గ్రామానికి చెందిన రంజిత్ బైగ్ భార్య జినిఫా బైగ్ పురిటి నొప్పులతో బాధపడుతున్న నేపథ్యంలో ఆమెను ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు కుటుంబ సభ్యులు. ధాలా ప్రాంతం నుంచి డూమ్ డూమా ప్రాంతంలోని వైద్య కేంద్రానికి 108 అంబులెన్సులో తీసుకెళ్లారు. అయితే, అక్కడ ఐసీయూ లేకపోవడం వల్ల తీన్​సుకియా సివిల్ ఆస్పత్రికి వెళ్లాలని వైద్యులు సూచించారు. అయితే, జిల్లా ఆస్పత్రికి చేరుకునేలోపే జినిఫా బైగ్ ప్రసవించింది. పండంటి నలుగురు చిన్నారులకు జన్మనిచ్చింది. అంబులెన్సులోని సిబ్బంది జినిఫా ప్రసవానికి సహకరించారు.

తల్లితో పాటు నలుగురు ఆడపిల్లలు ప్రస్తుతం క్షేమంగానే ఉన్నట్లు సమాచారం. డూమ్ డూమా ప్రైమరీ హెల్త్ సెంటర్​లో శిశువులను అబ్జర్వేషన్​లో ఉంచినట్లు వైద్యులు తెలిపారు. చిన్నారులంతా 1.5 కిలోల నుంచి 1.6 కిలోల మధ్య ఉన్నారని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అజ్మా గజంభి తెలిపారు. ఇలా సాధారణ ప్రసవం జరగటం చాలా అరుదు అని వివరించారు. మహిళ నలుగురు శిశువులకు జన్మనిచ్చిన విషయం తెలియగానే ఆస్పత్రి సిబ్బంది ఆసక్తిగా వచ్చి చూశారు. స్థానికులు సైతం ఆస్పత్రికి తరలి వచ్చారు.

ఇప్పటికే ఇద్దరు కుమార్తెలు- ఒకే కాన్పులో మరో ముగ్గురు!
ఇటీవల బిహార్​లోని జముయీ జిల్లాలో ఓ మహిళ ముగ్గురు శిశువులకు ఒకే కాన్పులో జన్మనిచ్చింది. ఆ మహిళకు ఇప్పటికే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు కావాలనుకొని గర్భం దాల్చగా ముగ్గురు ఆడపిల్లలే జన్మించారని కుటుంబ సభ్యులు తెలిపారు. జిల్లాలోని ఖైర్ బ్లాక్ మంగోబందర్​లో నివాసం ఉండే దిల్​చంద్ మాంఝీ, బిందు దేవిలకు 10 సంవత్సరాల క్రితం వివాహమైంది. కూలీ పనులు చేసుకుంటూ వీరు జీవిస్తున్నారు. చిన్న గుడిసెలో నివాసం ఉంటున్నారు. పుట్టిన సంతానం ఇద్దరూ ఆడపిల్లలే కాగా, కుమారుడు కావాలన్న కోరికతో కొన్ని నెలల క్రితం మహిళ గర్భం దాల్చింది. ఈసారి ఏకంగా ముగ్గురు ఆడపిల్లలు జన్మించారు. ఈ పూర్తి కథనం కోసం లింక్​పై క్లిక్ చేయండి.

18వారాలకు కవల పిండం మృతి- 125 రోజులకే మరో శిశువుకు జన్మ- వైద్య రంగంలోనే అద్భుతం

ఒకే కాన్పులో ఐదుగురికి జన్మ.. అంతా బాలికలే.. గర్భిణీకి సాధారణ డెలివరీ

Last Updated : Dec 22, 2023, 10:33 PM IST

ABOUT THE AUTHOR

...view details