Woman Gave Birth To 4 Babies : ఉత్తర్ కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఓ మహిళ.. ఒకే కాన్పులో నలుగురు నవజాత శిశువులకు జన్మనిచ్చింది. కానీ పుట్టిన కాసేపటికే నలుగురిలో ముగ్గురు పిల్లలు చనిపోయారు. మరో శిశువు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడం వల్ల వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం..
Woman Gives Birth To Quadruplets : కుప్వారా జిల్లా ఆస్పత్రికి షఫాక్ భట్ భార్య ఖలీదా.. ప్రసవానికి వచ్చింది. సోమవారం.. ఆ మహిళ ముగ్గురు మగ పిల్లలు, ఒక ఆడ పిల్లకు జన్మనిచ్చింది. అయితే ఆరోగ్య సమస్యల వల్ల ముగ్గురు మగ పిల్లలు మరణించారు. ఆడపిల్ల ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉండడం వల్ల శ్రీనగర్ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు.
ఒకే కాన్పులో నలుగురు శిశువుల జననం
కొన్ని నెలల క్రితం.. అసోంలోని కరీంగంజ్ జిల్లాలో ఓ మహిళ కూడా నలుగురు నవజాత శిశువులకు జన్మనిచ్చింది. వీరిలో ముగ్గురు అబ్బాయిలు కాగా.. ఒక అమ్మాయి ఉంది. దక్షిణ కరీంగంజ్‌లోని నీలం బజార్‌కు చెందిన లాస్టింగ్ ఖచియా, జనతా ఖచియా దంపతులు. ఈ నలుగురు శిశువులు పుట్టక ముందే వీరికి ఓ పాప కూడా ఉంది. అయితే రెండో కాన్పు కోసం జనతా ఖచియాను ఏప్రిల్ 17న క్రిస్టియన్ మిషనరీ ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబసభ్యులు. అనంతరం ఆమెను వైద్యులు పరీక్షించారు. ఈ క్రమంలో ఆమె గర్భంలో నలుగురు శిశువులు ఉన్నట్లు గుర్తించారు. శస్త్రచికిత్స అవసరమని భావించిన డాక్టర్లు ఆమెకు ఆపరేషన్ చేయగా నలుగురు పిల్లలు ఆరోగ్యంగా జన్మించారు.