Woman Gangraped: ఒడిశాలో దారుణం జరిగింది. ఇంట్లో పనికి పిలిచి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు వ్యక్తులు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్టు చేశారు పోలీసులు.
ఇదీ జరిగింది..

కేంద్రపార జిల్లాలోని రాజనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. బంగాల్‌కు చెందిన ఇద్దరు వలస కూలీలు.. తమ అద్దె ఇంట్లో పని కోసం ఓ 19 ఏళ్ల యువతిని సోమవారం సాయంత్రం పిలిపించారు. అనంతరం అమె నోట్లో గుడ్డలు కుక్కి సామూహిక అత్యాచానికి పాల్పడ్డారు.
ఈ ఘటన గురించి బాలిక తన కుటుంబానికి తెలియజేయగా.. ఆమె తండ్రి ఫిర్యాదుతో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ప్రాథమిక వైద్య పరీక్షల్లో యువతిపై గ్యాంగ్‌రేప్ జరిగినట్లు నిర్ధరణ అయ్యిందని పోలీసులు తెలిపారు. దీంతో తాపీ మేస్త్రీలుగా ఉన్న నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. వారిని జుడీషియల్ కస్టడీకి తరలించారు.
ఇదీ చూడండి:ఎనిమిదేళ్ల బాలికపై హత్యాచారం.. ఇసుకలో కప్పి పెట్టి..