రాజస్థాన్లోని నాగౌర్ జిల్లా గంగ్వాలో ముగ్గురు కిరాతకులు ఓ దళిత మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. గాజు సీసాను.. ఆమె సున్నిత భాగాల్లో ఉంచి చిత్రహింసలకు గురిచేశారు. ఈ నెల 19న జరిగిన ఈ దుర్ఘటనపై బాధితులు సోమవారం ఫిర్యాదు చేశారు. నిందితుల బెదిరింపులకు భయపడి బాధితురాలు మొదట ఫిర్యాదు చేయలేదని సమాచారం.
చిత్రహింసలు పెట్టి దళిత మహిళపై అత్యాచారం - రాజస్థాన్ నాగౌర్ జిల్లాలో అత్యాచారం
రాజస్థాన్లోని గంగ్వా గ్రామంలో ఓ దళిత మహిళ దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడి చిత్రహింసలకు గురిచేశారు. ఈనెల 19న ఈ ఘటన జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

రాజస్థాన్లో దారుణం.. దళిత మహిళపై అత్యాచారం
ఎట్టకేలకు ఘటన జరిగిన 5 రోజులకు బాధితురాలి కుటుంబ సభ్యులు పర్బత్సర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మూడు రోజుల క్రితమే ఠాణాకు వచ్చామని తెలిపారు. కానీ బదిలీ అయిన కారణంగా ఫిర్యాదుని స్వీకరించలేనని స్టేషన్ ఇంఛార్జి పేర్కొన్నారన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.
ఇదీ చదవండి :ఇవాంక మెచ్చిన 'జ్యోతి'కి జాతీయ పురస్కారం