పశ్చిమ్ బంగా.. కోల్కతాలో దారుణం చోటుచేసుకుంది. గార్డెన్ రీచ్ ప్రాంతంలోని ఓ అపార్టుమెంట్లోకి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి.. 26 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆ ఇంట్లో ఉన్న రూ.15లక్షల నగదు దోచుకెళ్లినట్టు పోలీసులు బుధవారం వెల్లడించారు.
ఆ కోణంలో దర్యాప్తు..
మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో ఈ దారుణం చోటుచేసుకున్నట్టు తెలిపారు. మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించగా అత్యాచారం జరిగినట్టు నిర్ధారణ అయిందని సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. ఇది ఆమెకు తెలిసిన వారి పనే అయి ఉంటుందా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. అత్యాచారం చేసిన అనంతరం ఫ్లాట్లో ఉన్న రూ.15లక్షల నగదు ఎత్తుకెళ్లినట్టు పేర్కొన్నారు.