తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైలు టాయిలెట్​లో మహిళ మృతదేహం.. క్లీనర్​ వెళ్లేసరికి.. - రైలు టాయిలెట్​లో మహిళ మృతదేహం

రైలు టాయిలెట్​లో మృతదేహం కనిపించడం కలకలం రేపింది. టాయిలెట్​ శుభ్రపరిచే క్లీనర్​ మృతదేహాన్ని చూసి రైల్వే పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన ఒడిశాలో జరిగింది.

woman found dead in train toilet dhanbad express
woman found dead in train toilet dhanbad express

By

Published : Apr 20, 2023, 10:48 PM IST

రైలు టాయిలెట్‌లో మహిళ మృతదేహం కనిపించడం కలకలం రేపింది. టాయిలెట్​ క్లీన్ చేసేందుకు వచ్చిన వ్యక్తి.. మృతదేహాన్ని చూసి రైల్వే పోలీసులకు సమాచారం అందించాడు. ఈ ఘటన ఒడిశాలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధన్​బాద్​ ఎక్స్​ప్రెస్​ రైలు భువనేశ్వర్​లో ఆగింది. అనంతరం టాయిలెట్లు క్లీన్​ చేయడానికి ఓ వ్యక్తి రైలులోకి ఎక్కాడు. టాయిలెట్​ క్లీన్ చేస్తుండగా.. అందులో ఓ గుర్తుతెలియని మహిళ మృతదేహం పడి ఉంది. ఆ క్లీనర్ వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. మహిళ వివరాలు ఇంకా తెలియలేదని తెలిపారు. ఇది హత్యా లేక ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్టు మార్టం పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

కరెంట్​ షాక్​తో ఒకరు మృతి..
ఉత్తర్​ప్రదేశ్​ గౌతమ్​బుద్ధ నగర్ జిల్లాలోని విశ్వవిద్యాలయంలో కరెంట్​ షాక్ కారణంగా ఓ కార్మికుడు మృతి చెందాడు. గ్రేటర్ నోయిడాలోని గౌతమ్ బుద్ధ యూనివర్సిటీలో గురువారం జరిగిన ఈ ప్రమాదంలో 29 ఏళ్ల వ్యక్తి మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మృతుడు బులంద్‌షహర్ జిల్లాకు చెందిన జగ్‌పాల్ సింగ్‌గా గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశ్వవిద్యాలయంలో పని చేస్తున్న సమయంలో సింగ్‌కు ప్రమాదవశాత్తు కరెంట్​ షాక్​ తగిలింది. దీంతో అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అక్కడే అతడు చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు.

సీఆర్పీఎఫ్​ జవాన్​ ఆత్మహత్య..?
ఒడిశా.. జాజ్‌పూర్ జిల్లా ధన్మండల్ ప్రాంతంలోని ఓ అడవి ప్రాంతంలో సీఆర్పీఎఫ్​ జవాన్ మృతదేహం చెట్టుకు వేలాడుతూ కనిపించిడం తీవ్ర కలకలం రేపింది. మూడు రోజుల క్రితం అదృశ్యమయిన సీఆర్పీఎఫ్ జవాన్.. గురువారం ఈ స్థితిలో ప్రత్యక్షమయ్యాడు. మృతుడు జగత్‌సింగ్‌పూర్ జిల్లాలోని సోంపూర్ గ్రామానికి చెందిన సూర్యకాంత్​గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం బరునాబంట్ కొండ సమీపంలో అతని మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

సూర్యకాంత్ ఏప్రిల్ 17 నుంచి కనిపించడం లేదంటూ అతడి కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రోన్ కెమెరా సహాయంతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినా ఫలితం లేకుండా పోయింది. అనంతరం జాజ్‌పూర్ రోడ్ సబ్ డివిజనల్ పోలీసు అధికారి నేతృత్వంలో మూడు పోలీసు బృందాలు.. అటవీ సిబ్బందితో కలిసి బరునాబంట్ కొండలో చేపట్టిన సెర్చ్ ఆపరేషన్​లో జవాన్​ సూర్యకాంత్​ను గమనించినట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details