తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బాబా బాగోతం... మహిళపై 19ఏళ్లుగా అత్యాచారం.. ఇప్పుడు ఆమె కూతుళ్లపై..

rape case against baba: భూతాల పేరు చెప్పి తనపై 19ఏళ్లుగా అత్యాచారం చేస్తున్న బాబాపై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కూతుళ్లపైనా బాబా కన్నేశాడని వాపోయింది. అయితే, ఈ ఆరోపణలను ఖండించిన బాబా.. మహిళ తనను బ్లాక్​మెయిల్ చేస్తోందని చెప్పుకొచ్చాడు.

Woman accused of blackmailing
Woman accused of blackmailing

By

Published : Apr 30, 2022, 10:25 AM IST

rape case against baba: ఉత్తరాఖండ్​లోని దెహ్రాదూన్​లో ఓ బాబా బాగోతం బట్టబయలైంది. భూతాల పేరు చెప్పి 19ఏళ్ల నుంచి ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడుతున్న బాబా.. ఇప్పుడు ఆమె కూతుళ్లపై కన్నేశాడు. తన విషయంలో ఓర్పుగా ఉన్న బాధితురాలు... కూతుళ్ల విషయం వచ్చే సరికి బాబా ఆడగాలను సహించలేకపోయింది. వెంటనే పోలీసులను ఆశ్రయించింది. బాబాతో పాటు అతడి భార్యపై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. అయితే, ఆ మహిళ తనను బ్లాక్​మెయిల్ చేస్తోందని బాబా ఆరోపించాడు.

వివరాల్లోకి వెళితే...:హరిద్వార్​కు చెందిన ఓ మహిళ ఉత్తరాఖండ్​లోని కరన్​పుర్​లో నివాసం ఉండేది. పరమానంద పురి అలియాస్ ప్రవీణ్ గుజ్రాల్ అనే బాబా సైతం అదే ప్రాంతంలో ఉండేవాడు. 2003 నుంచి ప్రవీణ్.. ఆ మహిళ ఇంటికి తరచూ వెళ్తుండేవాడు. చిన్నప్పుడు ఆమె జబ్బు పడ్డప్పుడు ఆత్మల పేర్లు చెప్పి.. తాను నయం చేస్తానని చెప్పేవాడు. ఈ క్రమంలో ఆమెకు 14ఏళ్ల వయసు ఉన్నప్పుడే అత్యాచారానికి పాల్పడ్డాడు. కూల్​డ్రింక్​లో మత్తు మందులు కలిపి తనపై రేప్ చేశాడని మహిళ ఆరోపించింది. కాగా, 2006లో బాబా ఆ ప్రాంతాన్ని వదిలి దెహ్రాదూన్​కు వెళ్లిపోయాడు. అయితే, యువతితో సంబంధాలు కొనసాగించారు. దీంతో ఆమెకు 2012లో ఓ మానసిక రోగితో వివాహం చేయించాడు. ప్రస్తుతం ఆ మహిళకు ఇద్దరు కూతుళ్లు (8ఏళ్లు, 4ఏళ్లు) ఉన్నారు.

'నా వద్ద నుంచి బాబా రూ.40 లక్షలు తీసుకున్నాడు. దీవెనల పేరుతో ఎప్పుడూ తనను దురుద్దేశంతో తాకేవాడు. 2021 మే నెలలో నా కూతుళ్లతో బాబా అనుచితంగా ప్రవర్తించాడు. కడుపులో పురుగులు చనిపోతాయని చెబుతూ నా కూతుళ్లకు ఆల్కహాల్ ఇచ్చేవాడు. బాబా ఇచ్చే ఔషధాల వల్ల నాకు చాలా సార్లు అబార్షన్ అయింది' అని బాధిత మహిళ చెప్పుకొచ్చింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రవీణ్ గుజ్రాల్, అతడి భార్య పూనమ్​పై విచారణ చేపట్టారు. అయితే, మహిళ ఆరోపణలను ప్రవీణ్ కొట్టిపారేశాడు. తనను బ్లాక్​మెయిల్ చేసేందుకే మహిళ ఇలా ఆరోపణలు చేస్తోందని అన్నాడు. గతంలోనూ బాబాపై మహిళ ఇలాగే ఆరోపణలు చేసినట్లు సమాచారం. తన ఇల్లు లాగేసుకున్నారని మహిళ ఆరోపించగా.. విచారణ చేపట్టిన అధికారులు బాబాకు క్లీన్​చిట్ ఇచ్చారు.

ఇదీ చదవండి:90 కిలోల హెరాయిన్​ పట్టివేత​​​.. విలువ రూ.450 కోట్లకుపైనే!

ABOUT THE AUTHOR

...view details