man sets fire to woman: కేరళలో దారుణం జరిగింది. యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఓ వ్యక్తి. కోజికోడ్ జిల్లాలోని ఓ గ్రామ పంచాయతీ కార్యాలయంలో పని చేసే ఆమెను చంపి.. తానూ నిప్పంటించుకున్నాడు. ఇరువురికి తీవ్రంగా గాయాలు కాగా.. వారిని ఆసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతు ఆ యువతి మరణించినట్లు అధికారులు తెలిపారు. అనంతరం యువకుడు సైతం ప్రాణాలు కోల్పోయాడు.
ఈ ఘటన శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో జరిగింది. తిక్కోడి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఈ ఘటన జరిగినట్లు గుర్తించారు. బాధితురాలు కంప్యూటర్ సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకొని నాలుగు రోజుల క్రితమే పంచాయతీ కార్యాలయంలో ప్రాజెక్ట్ అసిస్టెంట్‌గా చేరిందని వివరించారు.