Woman DSP Molested: పోలీసు వ్యవస్థకే మచ్చ తెచ్చే ఘటన ఒకటి ఝార్ఖండ్ రాంచీలో జరిగింది. ఏకంగా మహిళా డీఎస్పీనే కొందరు ఆకతాయిలు ఆట పట్టించారు. రాత్రి సమంయలో ఆమెను వేధించారు. ఇద్దరు కానిస్టేబుళ్లు కూడా యువకులను రెచ్చగొడుతూ.. డీఎస్పీని రక్షించకుండా వ్యవహరించారని తెలుస్తోంది.
ఇదీ జరిగింది..
రాంచీ ఓల్డ్ పోలీస్ లైన్ సమీపంలో.. సోమవారం రాత్రి విగ్రహ నిమజ్జన కార్యక్రమంలో భాగంగా ఊరేగింపు జరుగుతోంది. అసభ్యకర డీజే పాటలకు మద్యం మత్తులో ఉన్న యువకులు చిందులు వేస్తున్నారు. సమాచారం అందుకున్న మహిళా డీఎస్పీ అక్కడికి చేరుకొని.. పాటలు ఆపేసి, వెంటనే వెళ్లిపోవాలని హెచ్చరించారు. దీంతో ఆగ్రహించిన యువత.. ఆమెపై వేధింపులకు దిగారు. అసభ్యంగా ప్రవర్తించారు.