ఉత్తరప్రదేశ్ సంభాల్ జిల్లాలోని గ్రామ్పురా గ్రామంలో తనపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేసిన మహిళ ఆత్మహత్య చేసుకుని మరణించింది. కేసు నమోదు చేసిన కొద్ది రోజుల్లోనే ఇలా జరిగిందని పోలీసులు తెలిపారు. అయితే నిందితుడ్ని అప్పటికే అరెస్ట్ చేశామని వెల్లడించారు.
బాహ్జోయి పోలీసు స్టేషన్ పరిధిలో మహిళ ఆత్మహత్య చేసుకుని మరణించింది. జనవరి 27న ఓ వ్యక్తి తనను అత్యాచారం చేశాడని కేసు నమోదు చేసింది. నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు, నిందితుడు ప్రేమించుకున్నారు.