Woman Dies After Falling into Nala in Secunderabad : సికింద్రాబాద్‌లోని మెట్టుగూడ దూద్‌బావి వద్ద జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తున్న మహిళా నాలాలోకొట్టుకుపోయింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షం కారణంగా బ్రిడ్జి కింద నుంచి వెళ్లే ప్రయత్నంలో ఆమె ఒక్కసారిగా నాలాలో పడిపోయింది. నాలా ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో అందులో కొట్టుకుపోయింది. అయితే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో నాలాలో గాలించిన పోలీసులకు చివరకు అంబర్ నగర్ వద్ద విగతజీవిగా తేలి కనిపించింది.
Woman Dies After Falling into Nala in Secunderabad : నాలాలో కొట్టుకుపోయిన మహిళ.. 3 కిమీ. దూరంలో లభించిన మృతదేహం - నాలాలో పడి మహిళ మృతి
Published : Sep 28, 2023, 8:20 PM IST
|Updated : Sep 28, 2023, 9:23 PM IST
20:09 September 28
Woman Dies After Falling into Nala in Secunderabad : నాలాలో కొట్టుకుపోయిన మహిళ.. వేరే ప్రదేశంలో లభించిన మృతదేహం
Girl falls in nala: పాల ప్యాకెట్ కోసం వెళ్తుండగా.. నాలాలో పడి చిన్నారి మృతి.. సీసీ టీవీలో దృశ్యాలు
Woman Dies into Nala in Secunderabad : స్థానికులు ఆమెను బ్రిడ్జి కింద నుంచి వెళ్లవద్దని వారించినప్పటికీ ఆమె వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. నాలాలో పడిన వెంటనే స్థానికులు పారిశుద్ధ్య కార్మికురాలిని రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ.. నాలా ప్రవాహం ఉద్ధృతంగా ఉండడంతో ఎలాంటి ప్రయోజనం లేకపోయిందన్నారు. మెట్టుగూడ వద్ద గలనాలానుంచి సుమారు మూడు కిలోమీటర్ల పాటు కొట్టుకుపోయి వారాసిగూడలోని అంబర్‌నగర్ వద్ద మృతదేహం లభ్యమైంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది మృతదేహాన్ని నాలా నుంచి బయటకు వెలికి తీశారు. ముఖంపై బలమైన దెబ్బలు ఉన్నాయి. ఈ దెబ్బలు నాలాలో కొట్టుకుపోయినప్పుడు ఏదైనా గట్టిగా తగిలి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
Hyderabad Woman Missing in Nala : హైదరాబాద్ గాంధీనగర్‌లో గల్లంతైన మహిళ కోసం కొనసాగుతున్న గాలింపు
Girl falls in nala: 'చిన్నారి మృతికి బాధ్యత వహిస్తూ కేటీఆర్ రాజీనామా చేయాలి'