Shopping Complex Incident: కర్ణాటకలోని బెంగళూరు బ్రిగేడ్ రోడ్డులో ఉన్న ఓ షాపింగ్ కాంప్లెక్స్‌కు వెళ్లిన ఇద్దరు యువతీయువకులు ప్రమాదవశాత్తు రెండో అంతస్తు నుంచి జారి పడిపోయారు. ఈ సంఘటనలో యువతి అక్కడిక్కడే మృతి చెందగా.. యువకుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
పోలీసుల వివరాల ప్రకారం.. శనివారం బ్రిగేడ్ రోడ్డులోని షాపింగ్ కాంప్లెక్స్‌కు మధ్యాహ్నం సమయంలో లియా, పీటర్లు షాపింగ్‌కు వెళ్లారు. మెట్లు ఎక్కుతూ ప్రమాదవశాత్తు రెండో అంతస్తు కిటికీ నుంచి లియా(20) కింద పడిపోయింది. తీవ్ర గాయాలపాలై మృతి చెందింది. జారి పడిన లియాను రక్షించేందుకు ప్రయత్నించిన ఆమె స్నేహితుడు పీటర్ కూడా కింద పడిపోయాడు. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కిటికీలకు గ్రిల్స్ లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు.