తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అంబులెన్స్​ ఆలస్యం.. రాజ్​భవన్​ ముందే మహిళ ప్రసవం.. శిశువు మృతి

Woman Deliver Baby On Road In Uttar Pradesh : సరైన సమయానికి అంబులెన్స్​ రాక రిక్షాలో ఆస్పత్రికి తరలించిన గర్భిణీకి.. రాజ్​ భవన్​ ఎదురుగా ఉన్న రహదారిపై ప్రసవం అయింది. దీంతో నవజాత శిశువు మృతి చెందింది. ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన ఈ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి.

Woman Deliver Baby On Road In Uttar Pradesh
Woman Deliver Baby On Road In Uttar Pradesh

By

Published : Aug 13, 2023, 4:55 PM IST

Updated : Aug 13, 2023, 5:43 PM IST

Woman Deliver Baby On Road In Uttar Pradesh : అంబులెన్సు రావడం ఆలస్యమవడం వల్ల రిక్షాలో ఆస్పత్రికి తరలించిన గర్భిణీ రోడ్డుపైనే ప్రసవం అయింది. దీంతో నవజాత శిశువు అక్కడే మృతిచెందింది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ రాజధాని లఖ్​నవూలోని రాజ్​భవన్​ ఎదురుగా జరిగింది. ఈ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి.

ఇదీ జరిగింది..
లఖ్​నవూలోని మాల్​ అవెన్యూ ప్రాంతంలో రూప అనే 5 నెలల గర్భిణీ నివసిస్తోంది. అయితే డెలివరీ సమయం రాకముందే ఆమెకు నొప్పులు వచ్చాయి. దీంతో అంబులెన్సుకు ఫోన్​ చేశారు రూప కుటుంబ సభ్యులు. పలుమార్లు ప్రయత్నించినా అంబులెన్సు రాలేదు. చేసేదేమి లేక గర్భిణీని రిక్షాలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. మార్గమధ్యలో నొప్పులు ఎక్కువై.. మహిళ రోడ్డు పక్కనే ప్రసవం అయింది. ఈ ఘటన రాజ్​భవన్​ 15వ నంబర్​ గేటు ముందు జరిగింది. ప్రసవం అయిన కొద్దిసేపటి తర్వాత అంబులెన్స్ వచ్చింది. అనంతరం మహిళను ఝల్కారీ ఆస్పత్రికి తరలించారు. అయితే, శిశువు అప్పటికే చనిపోయిందని వైద్యులు ధ్రువీకరించారు. మహిళకు ప్రీ మెచ్యూర్​ డెలివరీ అయిందని చెప్పారు.

రాజ్​భవన్​ ముందు మహిళ ప్రసవం

ఈ విషయం తెలుసుకున్న ఉత్తర్​ప్రదేశ్​ డిప్యూటీ సీఎం బ్రజేశ్​ పాఠక్.. మహిళ భర్తతో ఆస్పత్రికి చేరుకున్నారు. అనంతరం, శిశువు మృతదేహంతో బాధితురాలి భర్తను తన కారులో శ్మశానానికి తీసుకెళ్లారు. అక్కడ శిశువును పూడ్చిపెట్టారు. బాధిత కుటుంబ సభ్యులను ఆదుకుంటామని బ్రజేస్​ హామీ ఇచ్చారు. అయితే, అంబులెన్స్​ ఆలస్యంగా వచ్చిన విషయం తమ దృష్టికి వచ్చిందని.. ఈ ఘటనకు సంబంధించిన దర్యాప్తు బాధ్యతను ప్రిన్సిపల్​ సెక్రటరీకి అప్పగించామని తెలిపారు. ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరించారని తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

రాష్ట్ర రాజధానిలోనే ఈ దుర్ఘటన జరగడం వల్ల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సర్కార్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యోగి పాలనలో ఆరోగ్య రంగం నిర్లక్ష్యానికి గురైందని ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ- ఎస్​పీ నిప్పులు చెరిగింది. ఆరోగ్య వ్యవస్థ వెంటిలేటర్​పై ఉందని బీజేపీ ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించారు ఎస్​పీ నేత శివపాల్ యాదవ్​. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

రోడ్డుపైనే పురుడుపోసిన 'ఆటో డ్రైవర్‌ చంద్రన్​'

కరోనా సోకిన గర్భిణి ప్రాణం కాపాడిన లారెన్స్‌

Last Updated : Aug 13, 2023, 5:43 PM IST

ABOUT THE AUTHOR

...view details