తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అనారోగ్యంతో మృతి! అంబులెన్స్​లో తీసుకెళ్తుండగా లేచి కూర్చున్న 'అనిత'- ఇప్పుడు హెల్త్ ఓకే

Woman Declared Dead Alive : బ్లడ్ క్యాన్సర్​తో బాధపడుతున్న ఓ మహిళ చనిపోయిందని వైద్యులు ప్రకటించారు. దీంతో ఆమె మృతదేహాన్ని అంబులెన్స్​లో గ్రామానికి తీసుకెళ్తున్నాడు భర్త. మార్గమధ్యలో ఆమె ఒక్కసారిగా లేచి కూర్చుని నీరు తాగింది. దీంతో అంతా షాక్​ అయ్యారు. ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిందీ ఘటన.

Woman Declared Dead Alive
Woman Declared Dead Alive

By ETV Bharat Telugu Team

Published : Dec 31, 2023, 10:53 AM IST

Woman Declared Dead Alive :చనిపోయిందని వైద్యులు ప్రకటించిన కొద్దిసేపటికే లేచి కూర్చుంది ఓ మహిళ. నీరు అడిగి మరి తాగింది. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఆమెను చూసేందుకు వస్తున్నారు. ఉత్తర్​ప్రదేశ్​లోని హమీర్​పుర్​ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

అసలేమైందంటే?
జిల్లాలోని రత్​ పోలీస్​స్టేషన్ పరిధిలోని సదర్​ గ్రామానికి చెందిన మతాదిన్ రక్వార్ భార్య అనిత(33) కొన్నాళ్లుగా బ్లడ్ క్యాన్సర్​తో బాధపడుతోంది. అనేక ఆస్పత్రుల్లో వైద్యం చేయించినా ఆమెకు నయం కాలేదు. భోపాల్​, అమృత్ సర్​ వంటి నగరాల్లో ప్రముఖ ఆస్పత్రులకు తీసుకెళ్లినా లాభం లేకుండాపోయింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల పదే పదే నగారానికి వెళ్లి వైద్యం చేయించుకునే స్థోమత లేక ఇటీవలే తన బంధువు రాజు ఇంటికి వెళ్లాడు మతాదిన్. జలంధర్​లోని ఓ ఆస్పత్రికి అనితను తీసుకెళ్లి చికిత్స చేయించడం ప్రారంభించాడు రాజు.

భార్య అనిత, కుమార్తెతో మతాదిన్

అయితే 15రోజుల క్రితం అనిత ఆరోగ్యం మరింత క్షీణించింది. వెంటనే కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. రూ.20వేలు కట్టాకే వైద్యులు చికిత్స ప్రారంభించారని మతాదిన్ తెలిపాడు. ఆ తర్వాతరోజు ఉదయం రూ.60 వేలు కట్టమన్నారని వెంటనే చెల్లించానని చెప్పాడు. అక్కడి కొంతసేపటికి తన భార్య చనిపోయిందని వైద్యులు చెప్పారని పేర్కొన్నాడు. అయితే అనిత మృతదేహానికి వైద్యులు అక్కడే అంత్యక్రియలు జరపమన్నారట.

కానీ అనిత మృతదేహానికి అంత్యక్రియలు స్వగ్రామంలోనే జరిపించాలని మాతదిన్ నిర్ణయించుకున్నాడు. ఆ విషయాన్ని వైద్యులకు చెప్పాడు. అనిత మృతదేహాన్ని తీసుకుని ఓ ప్రైవేట్ అంబులెన్స్​లో గ్రామానికి బయలుదేరాడు. నోయిడాకు అంబులెన్స్​ చేరుకోగానే అనిత ఒక్కసారిగా లేచి కూర్చుందని మతాదిన్ తెలిపాడు. వెంటనే నీరు తాగిందని, ఇప్పుడు ఆమె ఆరోగ్యం బాగానే ఉందని చెప్పాడు.

కొద్దిరోజుల క్రితం, ఉత్తరాఖండ్​లో ఇలాంటి ఘటనే జరిగింది. చనిపోయిందని అనుకున్న 109 ఏళ్ల బామ్మ లేచి కూర్చొంది. దాదాపు 7 గంటల తర్వాత బామ్మ లేచి కూర్చొవడం వల్ల ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు కుటుంబ సభ్యులు, గ్రామస్థులు. అంతేకాకుండా లేచిన వెంటనే తనకు చాట్​ తినాలనిపిస్తుందని అడిగి మరీ తెప్పించుకొని ఆరగించింది వృద్ధురాలు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తప్పిపోయిన తల్లికి అంత్యక్రియలు.. మరుసటి రోజే ఇంటికి వచ్చిన 'ఆమె'ను చూసి!

హత్య కేసులో శిక్ష.. ఏడేళ్ల క్రితం 'చనిపోయిన' మహిళను తీసుకొచ్చిన నిర్దోషులు

ABOUT THE AUTHOR

...view details